IOCL Recruitment 2022 – Apply for Graduate
Apprentice Engineers
ఐఓసీఎల్ - గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
ఇంజినీర్ల రిక్రూట్మెంట్ – పూర్తి వివరాలు ఇవే
భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న
కేటగిరీ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
ఇంజినీర్లు
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్
ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇనుస్టుమెంటేషన్
ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్
ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
వాలిడ్ గేట్ 2022 స్కోర్ ఉండాలి.
వయసు: 30.06.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: గ్రాడ్యుయేట్
అప్రెంటిస్ ఇంజినీర్లుగా ఉన్నప్పుడు నెలకు నిర్ణీత స్టెఫండ్ అందజేస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీర్లని ఇంజినీర్లు/ ఆఫీసర్లుగా నియమించినప్పటి నుంచి
వారికి నెలకు రూ.50000 - రూ.160000 వరకు
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాలిడ్ గేట్-2022 మెరిట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్
లిస్ట్ చేసిన వారిని గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.05.2022.
0 Komentar