Kendriya Vidyalaya admissions under MP
quota put on hold
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా
నిలిపివేత - ఇతర విశేష ప్రవేశాలూ తాత్కాలికంగా రద్దు
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు
సంబంధించి తాజాగా కీలక నిర్ణయం వెలువడింది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఎంపీల కోటా
కింద ఇస్తున్న అడ్మిషన్లను నిలిపివేశారు. పలు ఇతర ప్రత్యేక కోటాల్లో కల్పిస్తున్న
ప్రవేశాలనూ తాత్కాలికంగా రద్దు చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ ఈ
విధానాల్లో ప్రవేశాలను అనుమతించొద్దని పేర్కొంటూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ని
కేంద్రీయ విద్యాలయాల ప్రధానోపాధ్యాయులకు తాజాగా లేఖ రాసింది.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం..
ఒక్కో లోక్‌సభ ఎంపీ తన పార్లమెంటు స్థానం పరిధిలోని పాఠశాలలకు 10
మంది విద్యార్థులను ప్రతిపాదించడానికి వీలుంది. తన స్థానం పరిధిలో కేంద్రీయ
విద్యాలయం లేకపోతే పొరుగు నియోజకవర్గాల్లోని పాఠశాలలకు సిఫార్సు చేసే వెసులుబాటు
ఉండేది. రాజ్యసభ సభ్యులైతే.. రాష్ట్రంలో ఎక్కడైనా పది మంది విద్యార్థులను సిఫార్సు
చేయొచ్చు. ఈ కోటా కింద ఒకటి నుంచి 9వ తరగతి వరకు
విద్యార్థులను ప్రవేశాల కోసం ప్రతిపాదించే వీలుంటుంది.
ఇటీవలి కాలంలో తల్లిదండ్రుల నుంచి
ఒత్తిడి పెరగడంతో తమ కోటా కింద సిఫార్సు చేయగల సీట్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు
పార్లమెంటు లోపల, బయట డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే
ప్రస్తుతం కోటా మొత్తాన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. కేంద్రీయ
విద్యాలయ ప్రవేశ మార్గదర్శకాల్లోని పార్ట్-బిలో పేరా-1 కింద
పేర్కొన్న అన్నిరకాల ప్రవేశాలను నిలిపివేయాలని కేంద్రీయ విద్యాలయ కేంద్ర కార్యాలయం
ప్రధానోపాధ్యాయులకు పంపిన లేఖలో పేర్కొంది.
==============
KVS ADMISSIONS 2022-23
==============
0 Komentar