NPCIL Recruitment 2022: Apply for 225
Executive Trainee Posts – Details Here
ఎన్‌పీసీఐఎల్ లో 225 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు – అర్హత, ఎంపిక విధానం మరియు
దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగానికి చెందిన
అణుశక్తి నగర్ (ముంబయి)లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
(ఎన్‌పీసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
మొత్తం ఖాళీలు: 225
విభాగాల వారీగా ఖాళీలు:
1) మెకానికల్: 87
2) కెమికల్: 49
3) ఎలక్ట్రికల్: 31
4) ఎలక్ట్రానిక్స్: 13
5) ఇన్స్ట్రుమెంటేషన్: 12
6) సివిల్: 33
అర్హత: కనీసం 60
శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్)/ ఐదేళ్ల
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత. గేట్ 2020/ 2021/ 2022
స్కోర్ ఉండాలి.
వయసు: 28.04.2022 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టెఫండ్: నెలకు రూ.55000లతో పాటు వన్ టైం బుక్ అలవెన్సు కింద రూ.18000
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2020/ 2021/ 2022 మెరిట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు . షార్ట్
లిస్ట్ చేసిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
13.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.04.2022.
ఇంటర్వ్యూ తేదీలు: 2022, జూన్ 13-25.
0 Komentar