PNB Recruitment 2022: Apply for 145
Specialist Officer (SO) Posts – Details Here
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 145 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం
మరియు పరీక్ష విధాన వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన
న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 145
పోస్టుల వారీగా ఖాళీలు:
1) మేనేజర్లు (రిస్క్): 40
2) మేనేజర్లు (క్రెడిట్): 100
3) సీనియర్ మేనేజర్లు
(ట్రెజరీ): 05
అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ సీఎంఏ (లేదా) కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీడీఎం (ఫైనాన్స్)/ తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్) ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం
220
మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో పార్ట్ 1, పార్ట్
2 విభాగాలు ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది.
పార్ట్ 1, పార్ట్ 2లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా
అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50
చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.05.2022.
పరీక్ష తేది: 12.06.2022.
APPLY HERE (turn your phone)
0 Komentar