TSLPRB: Constable Notifications Released
in Excise and Transport Departments
తెలంగాణలో పోలీసు రవాణా విభాగం, ఎక్సైజ్
శాఖలో కలిపి 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
=================
UPDATE 21-05-2022
తాజాగా దరఖాస్తు గడువును
పొడిగించింది. నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమమైన
దరఖాస్తుల ప్రక్రియ 20 తో ముగిసింది. వయోపరిమితి పెంచడంతో
మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున దరఖాస్తు గడువును
ఈనెల 26 వరకు పొడిగించినట్లు పోలీసు నియామక మండలి
వెల్లడించింది.
=================
రాష్ట్రంలో మరో రెండు విభాగాల్లో
పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసు రవాణా
విభాగం,
ఎక్సైజ్ శాఖలో కలిపి 677 కానిస్టేబుల్
ఉద్యోగాలకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఎక్సైజ్ శాఖలో 614 పోస్టులు, పోలీసు రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మే 2వ
తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
స్వీకరించనున్నారు.
పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక,
జైళ్ల శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీసు
నియామక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు
నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా మే 2 నుంచి 20వ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు,
వయో పరిమితి, సిలబస్ తదితర వివరాలు వెబ్‌సైట్లో
పొందుపరిచామని తెలిపారు. యూనిఫాం పోస్టులకు ఈ నోటిఫికేషన్లోనూ మూడేళ్ల గరిష్ఠ
వయోపరిమితి సడలింపు కల్పించింది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022. 26-05-2022
==================
TRANSPORT CONSTABLE
==================
PROHIBITION & EXCISE CONSTABLE
==================
USER GUIDE
FOR ONLINE APPLICATION
==================
TS Police Recruitment 2022: తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల – మొత్తం పోస్టుల
సంఖ్య 16614 – పూర్తి వివరాలు ఇవే
==================
TSPSC: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల – మొత్తం 503 పోస్టులు - పూర్తి
వివరాలు ఇవే
==================
0 Komentar