UGC: Guidelines for Pursuing Two
Academic Programmes Simultaneously – Details Here
ఏక కాలంలో రెండు డిగ్రీలపై యూజీసీ మార్గదర్శకాలు జారీ
ఏకకాలంలో రెండు డిగ్రీలు చదవొచ్చని
వెల్లడించిన యూజీసీ బుధవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది.
వాటిని దేశంలోని అన్ని వర్సిటీలకు పంపింది. విద్యార్థుల ప్రయోజనార్థం ఒకేసారి
రెండు డిగ్రీలు చదువుకునే అవకాశం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని యూజీసీ ఆయా
వర్సిటీ ఉపకులపతు లకు లేఖలు రాసింది. మార్గదర్శకాల పేరిట కేవలం అయిదు అంశాలను
మాత్రమే పేర్కొనడం గమనార్హం.
మార్గదర్శకాలు ఇవే:
1. ఒక విద్యార్థి ఏకకాలంలో
ప్రత్యక్షంగా రెండు పూర్తిస్థాయి కోర్సులు చదవొచ్చు. ప్రత్యక్షంగా రెండు చోట్ల
చదవాలనుకుంటే తరగతుల సమయాలు వేర్వేరుగా ఉండాలి.
2. రెండు కోర్సులను ప్రత్యక్షంగా
లేదా ఒకటి ప్రత్యక్షం- మరొకటి దూర విద్య/ ఆన్లైన్లో లేదా రెండు కోర్సులు కూడా దూర
విద్య/ఆన్లైన్లో చేయొచ్చు.
3. యూజీసీ/కేంద్ర ప్రభుత్వ
గుర్తింపు ఉన్నత విద్యాసంస్థలు అందించే దూరవిద్య/ ఆన్లైన్ కోర్సులు చేస్తేనే రెండో
డిగ్రీ చెల్లుబాటు అవుతుంది.
4. కొత్త విధానంలో అందించే
కోర్సులకు యూజీసీ/ ఇతర మండళ్ల నిబంధనలు వర్తిస్తాయి. ఆ సంస్థల నియంత్రణ ఉంటుంది.
5. యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి
నుంచి (ఏప్రిల్ 13) ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటి నుంచి రెండు
డిగ్రీలు చేస్తేనే చెల్లుతుంది.
0 Komentar