WhatsApp is Introducing Some Changes to
Media Visibility Related to Disappearing Messages
వాట్సాప్ ‘డిస్‌అపియరింగ్ చాట్’లో
మరో కొత్త అప్‌డేట్ - ‘మీడియా
విజిబిలిటీ’ సంబంధించిన వివరాలు ఇవే
మెసేజ్‌లను వాటంతట అవే డిలీట్
అయ్యేలా వాట్సాప్‌లో ‘డిస్‌అపియరింగ్ మెసేజెస్’
అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, సమస్య
సగమే తొలగిపోయింది. డిస్‌అపియరింగ్ మెసేజెస్ ఆన్‌లో ఉన్నా.. వచ్చిన ఇమేజ్‌లు,
వీడియోలు ఫోన్‌లోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆ ఫీచర్ వల్ల లాభం
తక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో వాట్సాప్ తాజాగా ఈ ఫీచర్‌లో మార్పు చేసింది.
డిస్‌అపియరింగ్ చాట్ ఫీచర్‌ను.. యూజర్ల గోప్యత కోసం తీసుకొచ్చారు. నిర్దిష్ట సమయం తర్వాత మెసేజ్‌లు డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. (ఉదాహరణకు మీరు మెసేజ్ వచ్చిన 24 గంటల్లో డిలీట్ అవ్వాలని ఎంచుకుంటే ఆ టైమ్‌కి అయిపోతుంది) అయితే, వాట్సాప్‌లో షేర్ చేసిన మీడియా ఫైల్స్ గ్యాలరీలో ఆటో సేవ్ అవ్వడంతో ప్రైవసీ లేకుండా పోతోంది. ఐఫోన్ యూజర్లు ‘సేవ్ టూ కెమెరా రోల్’, ఆండ్రాయిడ్ యూజర్లు ‘మీడియా విజిబిలిటీ’ ద్వారా మీడియా ఫైల్స్‌ను ఆటో సేవ్ చేసుకునే వారు. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్ ద్వారా డిస్‌అపియరింగ్ చాట్ ఆన్ చేస్తే... ఆటో డౌన్‌లోడ్ మోడ్ డిసేబుల్ కానుంది. డిస్‌అపియరింగ్ చాట్‌లోనూ ఇమేజ్/ వీడియో మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలంటే.. ఒక్కోదాన్ని క్లిక్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది.
‘డిస్‌అపియరింగ్’ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
వాట్సాప్ డిస్‌అపియరింగ్
మెసేజెస్‌తో వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లను కూడా కనిపించకుండా
చేయొచ్చు. యూజర్లు కావాల్సిన కాంటాక్ట్ నేమ్‌పై క్లిక్ చేస్తే ‘డిస్ అపియరింగ్
మెసేజెస్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఆన్/ఆఫ్ ఐచ్ఛికాలను ఉపయోగించొచ్చు. వాట్సాప్
గ్రూపుల విషయంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే, గ్రూప్
చాట్‌కు సంబంధించి మెసేజులు తొలగిపోయేలా చేసే అధికారం గ్రూప్ అడ్మిన్‌కు మాత్రమే
ఉంటుంది.
WhatsApp is introducing some changes to media visibility!
— WABetaInfo (@WABetaInfo) April 8, 2022
WhatsApp is now rolling out to all users some changes to the way media from disappearing chats is automatically saved on the latest beta and public builds of WhatsApp for Android and iOS.https://t.co/MOxgeT2IHl
0 Komentar