Wipro Elite National Talent Hunt (NTH) 2022 – Details for Project Engineer Posts with B.E/B.Tech/M.E/M.Tech Eligibility
విప్రో - ఎలైట్ నేషనల్ టాలెంట్
హంట్ ప్రోగ్రాం - 2021, 2022 గ్రాడ్యుయేట్స్ అర్హులు
-వివరాలు ఇవే
విప్రో సంస్థ మే 2022 సెషన్‌కు గాను ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిలో అర్హత సాధించిన 2021/ 2022 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి దేశవ్యాప్తంగా ఉన్న విప్రో ప్రాంగణాల్లో
ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
విప్రో - ఎలైట్ నేషనల్ టాలెంట్
హంట్ (NTH):
అర్హత: కనీసం 60
శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఉత్తీర్ణత.
ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగాలు మినహాయించి మిగిలిన అన్ని
బ్రాంచుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ / ఇంటర్ లో 60 శాతం మార్కులకు పైగా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ అసెస్మెంట్, బిజినెస్
డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఆన్లైన్ అసెస్మెంట్: దీనిలో మూడు
విభాగాలు ఉంటాయి.
1) ఆప్టిట్యూడ్ టెస్ట్:
లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వర్బల్) ఎబిలిటీ పరీక్ష సమయం 48 నిమిషాలు
ఉంటుంది.
2) రిటన్ కమ్యూనికేషన్
టెస్ట్: ఎస్సే రైటింగ్ ఉంటుంది. పరీక్షా సమయం 20 నిమిషాలు
ఉంటుంది.
3) ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్టులు: రెండు ప్రోగ్రాములకు కోడింగ్ రాయాల్సి ఉంటుంది. సమయం 60 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022
దరఖాస్తులకు చివరి తేది: 22.05.2022
ఆన్లైన్ అసెస్మెంట్ తేదీలు: 2022, మే 21 నుంచి జూన్ 05 వరకు.
0 Komentar