You Can Now Access DigiLocker Services
Through WhatsApp
వాట్సప్ ద్వారా డిజిలాకర్ సేవలు – వివరాలు
ఇవే
వాట్సప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం
డిజిలాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ నంబరు 9013151515 ద్వారా ప్రజలు పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, సీబీఎస్ఈ 10వ తరగతి పాస్ సర్టిఫికెట్, 10, 12 తరగతుల మార్క్
షీట్లు, ద్విచక్రవాహనాల ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు పొందొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్,
ఐటీశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వాట్సప్ నంబరుకు
నమస్తే/హాయ్/డిజిలాకర్.. ఈ పదాల్లో ఏదో ఒక దాన్ని టైప్ చేసి పంపితే వెంటనే ఆధార్
నంబరు పంపమని అడుగుతుంది. అది టైప్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ద్వారా
వ్యక్తిగత ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను
డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి డాక్యుమెంట్ నంబరును టైప్ చేసిన తర్వాతే అవి
డౌన్లోడ్ అవుతాయి. ప్రజలకు అవసరమైన దస్తావేజులను సులభంగా పొందడానికి ఈ సౌకర్యాన్ని
అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తెలిపింది.
ఈ డిజిలాకలో ఇప్పటికే 10 కోట్ల మంది పేర్లు నమోదుచేసుకొని 5 కోట్లకు పైగా
డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించింది.
0 Komentar