APPSC Group-I (27/2018): Final Results Released
ఏపిపిఎస్‌సి గ్రూప్-1 (27/2018): తుది ఫలితాలు విడుదల
==================
UPDATE 05-07-2022
గ్రూప్-I సర్వీసెస్ (నోటిఫికేషన్
నెం.27/2018) - ఎంపికైన అభ్యర్థుల తుది
జాబితా విడుదల 👇
==================
UPDATE 15-06-2022
CERTIFICATE
FOR NON-CREAMY LAYER for BCs
==================
UPDATE 31-05-2022
==================
జూన్ 15 నుంచి జరిగే మౌఖిక పరీక్షలకు 325 మంది ఎంపిక
గ్రూపు-1 (నోటిఫికేషన్ 27/ 2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్ టికెట్ల
నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచింది. జూన్ 15 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల
జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాం కనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ
విధానంలో జరిగిన మూల్యాంకనంవల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును
ఆశ్రయించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే (పెన్ను, పేపర్)
మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.
గత
అక్టోబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సి ఉండగా..
ఇప్పుడు విడుదల చేసింది. డిజిటల్ మూల్యాంకనం ఫలితాల్లో ముందు వరసలో ఉన్న పలువురు
అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను
దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్
తెలిపారు. గ్రూపు-1 పరీక్షలను 2020లో డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు.
మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం.
CLICK
FOR RESUTLS – SHORTLISTED FOR INTERVIEW
0 Komentar