Bengaluru Startup Announces 30-Minute
Official Nap Time at Work
బెంగళూరుకు చెందిన ఓ సంస్థ
మధ్యాహ్నం ఓ అరగంట పాటు ఉద్యోగుల విశ్రాంతి కొరకు ‘న్యాప్ టైం అవర్’ సదుపాయం
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర రావడం సహజమే. ఆ సమయంలో కొంత సేపు పడుకోవడం మంచిదే అని నిపుణులు కూడా చెబుతుంటారు. కానీ, ఆఫీసుల్లో ఉన్నప్పుడు అవన్నీ కుదరవు కదా..! మరి పని మధ్యలో కాసేపు కునుకు తీసే అవకాశం వస్తే..? అలాంటి సదుపాయాన్నే కల్పిస్తోంది బెంగళూరుకు చెందిన ఓ సంస్థ. మధ్యాహ్నం ఓ అరగంట పాటు ఉద్యోగులందరూ విశ్రాంతి తీసుకునేలా అధికారిక న్యాప్ టైం అవర్‌ను తీసుకొచ్చింది.
బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ (WakeFit) గత ఆరేళ్లుగా పరుపులు, సోఫాల తయారీ వ్యాపారంలో ఉంది. బుధవారం ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగెగౌడ నుంచి ఉద్యోగులకు ఓ ఈ-మెయిల్ వచ్చింది. అది చూడగానే ఉద్యోగులంతా ఆశ్చర్యంలో మునిగితేలారు.
‘‘మధ్యాహ్నం సమయంలో కొంత సేపు నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం. దాన్ని మనం ఎప్పుడూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మధ్యాహ్నం 26 నిమిషాల కునుకుతో మన ఫర్ఫామెన్స్ 33 శాతం పెరుగుతందని నాసా అధ్యయనంలో తేలింది. ఈ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుందని హార్వర్డ్ పరిశోధన తెలిపింది. వీటని దష్టిలో ఉంచుకుని మన కంపెనీలో ఉద్యోగులందరికీ మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు అధికారిక న్యాప్ టైం ఇవ్వాలని నిర్ణయించాం. ఇక నుంచి నిద్ర పోయే హక్కును మీరు పొందుతారు. అందుకు తగినట్లుగా వర్కింగ్ క్యాలెండర్‌లో మార్పులు కూడా చేశాం. ఇందుకోసం న్యాప్ పాడ్స్, ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయనున్నాం’’ అని చైతన్య ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.
ఈ మెయిల్ స్క్రీన్‌షాట్‌ను వేక్‌ఫిట్
బ్రాండ్ హెడ్ ప్రతీక్ మల్పని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
‘‘నిద్ర పోయేందుకు కూడా జీతం పొందుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’’ అని
ప్రతీక్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మెయిల్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Official Announcement 📢 #sleep #powernap #afternoonnap pic.twitter.com/9rOiyL3B3S
— Wakefit Solutions (@WakefitCo) May 5, 2022
0 Komentar