Centre to Release Today
Benefits Under PM Cares for Children
కోవిడ్ కారణంగా
తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు ‘పిఎం కేర్స్ పథకం’ కింద సాయం - నేడు ప్రధానమంత్రిచే
కార్యక్రమం ప్రారంభం
కొవిడ్
కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను
కోల్పోయిన చిన్నారులకు పిఎం కేర్స్ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించనున్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో
తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో
తండ్రినో కోల్పోయిన పిల్లలకు స్కాలర్షిప్పులు, పీఎం కేర్స్
పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ వైద్యబీమా కార్డు
అందించనున్నారు.
పథకంలో
భాగంగా.. పిల్లలకు 18 ఏళ్లు నిండేసరికి
వారి పేరిట రూ. 10 లక్షల సొమ్ము ఉండేలా
డిపాజిట్ చేస్తారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్ పై వడ్డీని వారికి ఆర్థికసాయంగా
అందిస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తిగా రూ. 10 లక్షలు లబ్దిదారులకు ఇచ్చేస్తారు. - అర్హులైన పిల్లలు తమ
పేర్లు నమోదు చేసుకునేందుకు 'పీఎం కేర్స్ ఫర్
చిల్డ్రన్' పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించారు.
పేర్ల నమోదు దగ్గర నుంచి దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించడం వరకు అన్నీ ఈ పోర్టల్ ద్వారా మాత్రమే సాగుతాయి.
0 Komentar