Chinnari Nestam June - 2022 Children’s
Telugu e-Magazine
"చిన్నారి నేస్తం" జూన్ - 2022 చిన్నారుల ఈ-మాసపత్రిక
ప్రియమైన చిన్నారులకు, ఇప్పుడు మన చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల (1 నుండి 10 తరగతుల విద్యార్థులు) నుండి రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, ఆటలు, గణితం, నేను చేసిన ప్రయోగం, భాష (తెలుగు, ఇంగ్లీష్), విజ్ఞాన శాస్త్ర విశేషాలు, సృజనాత్మక వ్యక్తీకరణలు మొదలగు అంశాలను chinnarinestam@gmail.com లేదా 7382392390 వాట్స్ యాప్ నెంబర్ కు పంపంవచ్చును. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.
ఉపాధ్యాయ మిత్రులారా! మీకు పంపిన మా చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక ను మీ మీ పాఠశాలల వాట్స్ యాప్ గ్రూప్ లలో పంపుట ద్వారా విద్యార్థులకు మరింత చేరువ చేయగలరని ఆశిస్తున్నాను.
మన చిన్నారి నేస్తం లో టీచర్ కాలమ్ పేరు తో ఒక శీర్షిక ను మీ ముందుకు తీసుకువచ్చాము. ఇందులో ఉపాధ్యాయుల బోధనా మెలుకువలు, పుస్తక సమీక్షలు, బోధనలో ఎదురయ్యే సమస్యలు- పరిష్కారాలు, success stories మొదలు బోధనా సంబంధిత సమాచారాన్ని మీరు కూడా పంపంవచ్చును. మీ రచనలు ఒక పేజీ కి మించకుండా, ఒక ఫోటో జోడించి పంపగలరు.
మీ రచనలపై సంపాదకులదే తుది నిర్ణయం.
ధన్యవాదాలతో,
మీ
వెలుగోటి నరేష్, టీచర్
చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక, ఎడిటర్
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గొట్టిగుండాల బి.సి.
కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా
8247430016, 7382392390
"ChinnariNestam" June - 2022 e-magazine
0 Komentar