Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Convert Your Photo into A WhatsApp Sticker: Follow These Steps

 

Convert Your Photo into A WhatsApp Sticker: Follow These Steps

మీ ఫోటోను వాట్సాప్ స్టిక్కర్లు గా మార్చుకోండి -  ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి

టెక్స్ట్ లు, ఎమోజీలు పక్కన పెట్టి స్టిక్కర్లను విరివిగా వాడేస్తోంది నేటి తరం. చెప్పాల్సింది సుత్తి లేకుండా, సూటిగా పంచ్ లతో, ఫన్నీగా చెప్పడానికి.. వారే స్వయంగా స్టిక్కర్లను రెడీ చేసుకుంటున్నారు. ఇందుకోసం చాలా మంది థర్డ్ పార్టీ యాప్ లు వినియోగిస్తున్నారు.

అయితే, ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మీ సొంత ఫొటోనే స్టిక్కర్ గా మార్చడానికి ఇన్‌బిల్ట్ ఫీచర్ ఉందని మీకు తెలుసా..? లేదంటే వాట్సాప్ లో స్టిక్కర్లు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

స్టిక్కర్ల తయారీ ఇలా..

* ఏదైనా ఫొటోను స్టిక్కగా మార్చడానికి వాట్సాప్ వెబ్ లేదా పీసీల్లో ముందుగా వాట్సాప్ ఖాతాను లాగిన్ చేసుకోవాలి.

* ఆపై కాంటాక్టుల్లో మీకు నచ్చిన చాట్ విండోలకు వెళ్లి, 'పేపర్ క్లిప్' మాదిరి ఉండే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* అందులో 'స్టిక్కర్’ ఆప్షన్ ఎంచుకోగానే మీకో పాప్ అప్ ఓపెన్ అవుతుంది.

* ఇక్కడ మీరు స్టిక్కర్ గా చేయాలనుకునే ఫొటోను సెలెక్ట్ చేసుకోవాలి.

* అంతే, మీకు కావాల్సినట్టుగా ఫొటోను కట్ చేసుకొని, దానిపై టెక్స్ట్, ఎమోజీలు సర్దుబాటు చేసుకొని సేవ్ చేసుకోవచ్చు.

* తర్వాత మీరు ముందుగా ఓపెన్ చేసిన చాట్ లో ఈ స్టిక్కరను పోస్టు చేయవచ్చు.

CLICK FOR WHATSAPP WEB

Previous
Next Post »
0 Komentar

Google Tags