క్రికెట్ లో నెట్‌రన్‌రేట్ ఎలా
కీలకం..?
అది ఎలా లెక్కిస్తారు..?
ఐపిఎల్ లో నెట్ రన్‌రేట్ చాలా ముఖ్యం.
ఉత్కంఠకర పరిస్థితుల్లో ఏయే జట్లు చోటు
దక్కించుకుంటాయనేది ఆసక్తిగా మారింది.
నెట్‌రన్‌రేట్ ఎలా కీలకం..?
క్రికెట్‌లో ఏ మెగా టోర్నీలో అయినా
నెట్‌రన్‌రేట్ కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గ్రూప్ లేదా లీగ్ స్టేజ్‌లో
టాప్‌లో నిలిచిన జట్లు తేలిగ్గా నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. అయితే, దిగువస్థాయిలో
నిలిచే జట్లు ఒక్కోసారి ఇతరులతో సమాన పాయింట్లతో నిలిస్తే.. అప్పుడు నెట్ రన్‌రేట్‌ను
పరిగణనలోకి తీసుకుంటారు. అదే ఆయా జట్ల భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. గతేడాది భారత
టీ20 లీగ్‌లో.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కోల్‌కతా,
ముంబయి చెరో 14 పాయింట్లు సాధించాయి. అయితే,
రన్‌రేట్‌లో కోల్‌కతా (+0.587).. ముంబయి (+0.116)
కన్నా కాస్త మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్‌కు చేరింది. అక్కడి నుంచి
ఫైనల్‌కు దూసుకెళ్లి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. దీన్ని బట్టి నెట్ రన్‌రేట్
ఎంత కీలకమో అర్థమవుతుంది.
ఎలా లెక్కిస్తారు..?
ఉదాహరణకు.. ఒక జట్టు ఏదైనా
టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడితే.. అందులో మొత్తం మ్యాచ్‌ల్లో కలిపి
ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు.
చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని
లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్నే రన్స్ పర్ ఓవర్‌గా నిర్ణయిస్తారు. అలాగే అదే
జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్లు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో
లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్లు ఆ మ్యాచ్‌లో నిర్దేశించిన ఓవర్లకన్నా తక్కువ
ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కిందే లెక్కిస్తారు. ఇక్కడ
కూడా సగటు పరుగులు లెక్కిస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే నెట్‌రన్‌రేట్.
ఉదాహరణ:
* ఒక టీ20 టోర్నీలో A అనే జట్టు B అనే
జట్టుతో తలపడిన మ్యాచ్‌లో 17.2 ఓవర్లలో 180/6 పరుగులు చేసిందని అనుకుందాం.
* అలాగే C అనే జట్టుతో ఆడిన మ్యాచ్‌లో A టీమ్ మొత్తం 20 ఓవర్లలో 145/5 పరుగులు చేసిందని భావిద్దాం..
* ఇక D అనే జట్టుతో ఆడిన మ్యాచ్‌లోనూ A మొత్తం 20 ఓవర్లలో 156/5 పరుగులు చేసిందని తీసుకుందాం..
===================
ఇప్పుడు A అనే
జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసిన పరుగులు.. 180+145+156= 481.
అలాగే ఎదుర్కొన్న ఓవర్లు కలిపితే..
17.2+20+20=57.2
ఇప్పుడు మొత్తం చేసిన పరుగుల నుంచి
ఆడిన ఓవర్లను తీసుకొని సగటు లెక్కిస్తే రన్ రేట్ పర్ ఓవర్ ఇలా వస్తుంది.. 481/57.2=
8.4090.
* ఇక A జట్టుతో B ఆడిన మ్యాచ్‌లో సాధించిన పరుగులు 20 ఓవర్లలో 179/6 అనుకుందాం..
* అలాగే A జట్టుతో C ఆడిన మ్యాచ్‌లో చేసిన పరుగులు 15.2 ఓవర్లలో 110 ఆలౌటైందని భావిద్దాం..
* ఇక A జట్టుతో D ఆడిన మ్యాచ్‌లో చేసిన పరుగులు 18 ఓవర్లలో 125 ఆలౌటైందని తీసుకుందాం..
ఇక్కడ C, D జట్లు తమకు కేటాయించిన 20 ఓవర్ల కన్నా తక్కువ
ఓవర్లలోనే ఆలౌటయ్యాయి. అలాంటప్పుడు రన్‌రేట్‌ను లెక్కించాలంటే.. ఆ పూర్తి ఓవర్ల
కోటాతోనే విభజించాలి.
===================
ఇక్కడ కూడా ఇతర జట్లు మొత్తం
సాధించిన పరుగులు.. 179+110+125=414
అలాగే ఇతర జట్లు ఆడిన లేదా
ఆడాల్సిన ఓవర్లు.. 20+20+20=60
ఇప్పుడు A జట్టుపై మొత్తం ఇతర జట్ల రన్‌రేట్ లెక్కిస్తే.. 414/60=6.9
===================
ఇప్పుడు వచ్చిన రెండు రన్‌రేట్ల మధ్య ఉన్నా తేడా లెక్కిస్తే.. A జట్టు నెట్ రన్‌రేట్ తెలుస్తుంది.
8.4090-6.9000=
+1.509.
0 Komentar