Govt clarifies on
Aadhaar sharing advisory by UIDAI
ఆధార్
వాడకంపై కేంద్రం కీలక సూచన - ఆధార్ ఫొటోకాపీకి
బదులుగా మాస్క్‌డ్ కాపీలను వినియోగించాలని సూచన
మాస్క్‌డ్
ఆధార్ కార్డు అంటే ఏమిటి? అది ఎలా డౌన్‌లోడ్
చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండీ
ఆధార్ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. అయితే మనం ఇచ్చిన ఆధార్ కార్డుల కాపీలు దుర్వినియోగం గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది.
ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్‌డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్‌డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది. అవసరం లేని దగ్గర మాస్క్‌డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కోరింది. హోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్సు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మాస్క్‌డ్ ఆధార్ అంటే?
భారత పౌరుల
సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్‌లైన్‌లో మరో
ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి
మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్
ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్
నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో
మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్‌డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా
ఉంచుతుంది.
దీనిపై మీ ఫొటో, క్యూఆర్ కోడ్, మీ చిరునామా
ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలనుకుంటే
ఈ మాస్క్డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు.
========================
AADHAAR: మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి? అది ఎలా డౌన్‌లోడ్
చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండీ 👇
========================
0 Komentar