Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India Creates Badminton History, Beat Indonesia 3-0 To Win Maiden Thomas Cup Title

 

India Creates Badminton History, Beat Indonesia 3-0 To Win Maiden Thomas Cup Title

భారత్ బ్యాడ్మింటన్ జట్టు సంచలనం -  ఇండోనేషియాను ఓడించి తొలి థామస్ కప్ టైటిల్‌ విజేతగా భారత్ 

భారత్‌ బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.

14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేశారు.

తొలుత 20 ఏళ్ల యువ ఆటగాడు లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత ఆంథోనీ గింటింగ్ పై విజయం సాధించి భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత డబుల్స్ లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో మహ్మద్ అహసన్-సంజయ సుకమౌల్లో పై గెలుపొందారు. దీంతో ఇండోనేషియాపై 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ తొలి సెట్‌ను కోల్పోయి మరీ విజయం సాధించడం విశేషం.

ఇక ఆఖరి గేమ్ లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 వరుస సెట్లలో జొనాతన్ క్రిస్టీని బోల్తా కొట్టించి 3-0 ఆధిక్యంతో థామస్ కపను భారత్ కైవసం చేసుకునేలా చేశాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags