IPPB Recruitment 2022: Apply for 650 GDS
Posts – Details Here
ఐపీపీబీలో 650 గ్రామీణ్ డాక్ సేవక్
పోస్టులు – అర్హత, పరీక్ష మరియు దరఖాస్తు వివరాలు
ఇవే
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్
మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)
దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్)
పోస్టులు:
మొత్తం ఖాళీలు: 650
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-34, తెలంగాణ-21.
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు గ్రామీణ్ డాక్ సేవక్ గా రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30.04.2022
నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.30000
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్
ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో 120 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది.
నెగిటివ్ మార్కింగ్ లేదు.
1) ఐపీపీబీ ప్రొడక్టుల
గురించి అవగాహన - 20 ప్రశ్నలు - 20
మార్కులు
2) బేసిక్ బ్యాంకింగ్/
పేమెంట్స్ బ్యాంక్స్ అవేర్ నెస్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు
3) జనరల్ అవేర్‌నెస్
- 15 ప్రశ్నలు - 15 మార్కులు
4) కంప్యూటర్ అవేర్ నెస్/
డిజిటల్ పేమెంట్స్ - 20 ప్రశ్నలు - 20
మార్కులు
5) న్యూమరికల్ ఎబిలిటీ
- 20 ప్రశ్నలు - 20 మార్కులు
6) రీజనింగ్ ఎబిలిటీ
- 15 ప్రశ్నలు - 15 మార్కులు
7) ఇంగ్లిష్ లాంగ్వేజ్
- 10 ప్రశ్నలు - 10 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 10.05.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022.
0 Komentar