Income Tax Rule: New
PAN Rule On Cash Deposits and Withdrawals
క్యాష్ డిపాజిట్/విత్
డ్రాల పై మే 26 నుండి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే
ఒక ఆర్థిక
సంవత్సరంలో చేసే రూ. 20 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్/విత్ డ్రాలకు పాన్ లేదా ఆధార్
కార్డును అందించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ కొత్త నియమాలను
తీసుకొచ్చింది.
ఈ కొత్త
రూల్స్ నేటి (మే 26) నుంచి అమలులోకి
రానున్నాయి. సీబిడిటీ నోటిఫికేషన్ ప్రకారం అధిక మొత్తంలో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద లావాదేవీలు చేసే వారు లేదా కరెంట్ లేదా
క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచేవారు పాన్ లేదా ఆధార్‌ను తప్పనిసరిగా వెల్లడించాలి.
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్, విత్ డ్రాలపై కొత్త నియమాలు ఇవే…
* ఒక ఆర్థిక
సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు లేదా పోస్టాపీసుల్లో రూ. 20 లక్షలు లేదా అంతకు మించి చేసే నగదు డిపాజిట్/విత్ డ్రాలకు
పాన్ లేదా ఆధార్‌ను ఇవ్వాలి.
* ఒక ఆర్థిక
సంవత్సరంలో చేసే డిపాజిట్లు, విత్ డ్రాల (రూ. 20 లక్షల మొత్తం) పై ఈ నియమం వర్తిస్తంది. అంటే ఒక ఆర్థిక
సంవత్సరంలో ఒకేసారి రూ.20 లక్షలు
డిపాజిట్/విత్ డ్రా చేసినా లేదా విడివిడిగా డిపాజిట్/ విత్ డ్రా చేసిన మొత్తం రూ. 20 లక్షలకు మించితే పాన్ కార్డు ఇవ్వాల్సిందే.
* వాణిజ్య
బ్యాంకులు మాత్రమే కాకుండా పోస్టాఫీసులు, సహకార
బ్యాంకులులో చేసిన డిపాజిట్/విత్ డ్రాలను కూడా పరిగణలోకి తీసుకొంటారు.
* పాన్ కార్డు
లేని వారు ఆధార్ కార్డును కూడా ఇవ్వచ్చు.
* నగదు
లావాదేవీలకు సంబంధించి ఈ కొత్త రూల్స్ ని అమలు చేసేందుకు ఆదాయపు పన్ను నిబంధనలు, 1962 లో పలు సవరణలు చేసినట్లు సీబీడీటీ నోటిఫై చేసింది.
* ఈ విధమైన
లావాదేవీల్లో ఇచ్చే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డులోని డెమోగ్రఫిక్(జనాభా), బయోమెట్రిక్ సమాచారాన్ని సెక్షన్ 139 ఏ ప్రకారం ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యా క్స్
(సిస్టమ్స్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్
(సిస్టమ్స్) వారి ద్వారా గానీ, సదరు డిపార్ట్మెంట్
ద్వారా అధికారం పొందిన వ్యక్తిగానీ ధృవీకరించాలి.
* అధిక
మొత్తంలో లావాదేవీలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారు, లావాదేవీలు చేసే 1 రోజుల ముందు
పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* బ్యాంకులు, పోస్టాపీసు ల వద్ద కరెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను
తెరిచేవారు కూడా పాన్ లేదా ఆధార్‌ను తప్పనిసరిగా వెల్లడించాలి.
0 Komentar