National Technology Day (May 11) - History
and Significance
జాతీయ సాంకేతిక దినోత్సవం (మే 11)
- చరిత్ర మరియు ప్రాముఖ్యత
జాతీయ సాంకేతిక దినోత్సవం (జాతీయ
సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 11న
నిర్వహించబడుతుంది. భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ఈ జాతీయ వైజ్ఞానిక
దినోత్సవం జరుపబడుతుంది.
చరిత్ర
భారత సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అప్పటి
ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు
నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II (ఐదు న్యూక్లియర్ బాంబుల
విస్ఫోటనాల పరీక్షల వరుస) అంటారు.
భారతదేశాన్ని అణు దేశంగా ప్రకటించడమేకాకుండా
మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా సంతకం
చేశారు.
ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న
డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3
పరీక్షలు, త్రిశూల్ క్షిపణులు, ఆపరేషన్లు
కూడా విజయవంతంగా పరీక్షించబడ్డాయి.
ప్రాముఖ్యత - కార్యక్రమాలు
* సైన్స్ ప్రాముఖ్యతను
తెలియజేయడానికి దేశంలోని వివిధ సాంకేతిక సంస్థలలో, ఇంజనీరింగ్
కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* శాస్త్ర, సాంకేతికరంగంలో కృషిచేసిన వ్యక్తులకు, పరిశ్రమలకు ఈ
దినోత్సవం రోజున అవార్డులు అందజేస్తారు.
* నూతన ఆవిష్కరణల గురించి
తెలియజేయడంతో పాటూ ఆ ఫలాలను అందరికీ అందేలా చూడడం.
0 Komentar