POWERGRID Recruitment 2022: Apply for 75
Field Engineer and Supervisor Posts – Details Here
పవర్ గ్రిడ్ లో 75 ఫీల్డ్
ఇంజినీర్ మరియు ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు – వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన
న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
(పీజీసీఐఎల్) నార్త్ ఈస్టర్న్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లో నిర్ణీత కాల
ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 75
1) ఫీల్డ్ ఇంజినీర్లు: 35
విభాగాల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రికల్-25, సివిల్-10.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/
బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.06.2022 నాటికి 29 ఏళ్లు
మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.30000 + ఇతర
అలవెన్సులు అందజేస్తారు.
2) ఫీల్డ్ సూపర్‌వైజర్లు: 40
విభాగాల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రికల్-30, సివిల్-10 .
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో
సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో
అనుభవం ఉండాలి.
వయసు: 01.06.2022 నాటికి 29 ఏళ్లు
మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.23000 + ఇతర
అలవెన్సులు అందజేస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.06.2022.
0 Komentar