Rajiv Kumar appointed Chief Election
Commissioner of India
భారత ఎన్నికల ప్రధాన అధికారిగా
రాజీవ్ కుమార్
భారత ఎన్నికల ప్రధాన అధికారి (చీఫ్
ఎలక్షన్ కమిషనర్ - సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర
న్యాయశాఖ మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత సీఈసీ సుశిల్
చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో రాజీవ్
కుమార్ మే 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ
సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. రాజీవ్‌కు అభినందనలు
తెలియజేశారు.
2020 సెప్టెంబరులో రాజీవ్
కుమార్ కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా చేరారు. 1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ కుమార్.. గతంలో ఆర్థిక శాఖ
కార్యదర్శిగా కూడా పనిచేశారు. అంతకుముందు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్
బోర్డు ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.
0 Komentar