Retired Teacher Donates
All His Retirement Benefits for Poor Children's Education – PM Mentioned in ‘Mann
Ki Baat’
విశ్రాంత
ప్రధానోపాధ్యాయుడికి ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రశంస - పదవీ విరమణ
ప్రయోజనాలన్నింటినీ పేద బాలికల విద్యాభివృద్ధి కోసం విరాళం
ఏపీ కి
చెందిన ఒక విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిని స్వయంగా ప్రధాని మోదీ ప్రశంసించారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్ రెడ్డి ఉద్యోగ
విరమణ అనంతరం వచ్చిన నగదును బాలికల శ్రేయస్సుకు వెచ్చిస్తున్నారు. ఈ మేరకు ఆయన
సేవలను ఆదివారం 'మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర
మోదీ అభినందించారు. రాంభూపాల్ రెడ్డి రాచర్ల మండలం యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత
పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు.
గత ఆగస్టు
నెలలో ఉద్యోగ విరమణ సందర్భంగా రూ. 25.72 లక్షల నగదు వచ్చింది. ఆ నగదును స్థానిక పోస్టాఫీసులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయగా, ప్రతి మూడు నెలలకు రూ.30 వేల వరకూ వడ్డీ వస్తోంది. ఈ మొత్తాన్ని సుకన్య సమృద్ధి యోజనకు మళ్లించి
యడవల్లి,
చెర్లోపల్లి, అంకిరెడ్డిపల్లెలోని
88 మంది పేద బాలికల విద్యాభివృద్ధికి వెచ్చిస్తున్నారు.
అధికారుల సమక్షంలో ఈ నగదును తొలిసారి జమ చేసి సేవలకు శ్రీకారం చుట్టారు.
0 Komentar