SSC Phase X Recruitment 2022: Apply for
2065 SSC Selection Posts – Details Here
ఎస్‌ఎస్‌సి-ఫేజ్ X 2065
సెలక్షన్ పోస్టులు – అర్హత, పరీక్ష మరియు
దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్
ట్రెయినింగ్ విభాగానికి చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి)
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/ సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో ఫేజ్-X సెలక్షన్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 2065
పోస్టులు: నర్సింగ్ ఆఫీసర్లు, సీనియర్
రిసెర్చ్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, రిసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ అటెండెంట్లు,
పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్, ఎంటీఎస్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో
తరగతి,
ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఆపై ఉత్తీర్ణత.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18-30
ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను 200
మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు.
పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది.
దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు చొప్పున
కోత విధిస్తారు.
1) జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు -50 మార్కులు
2) జనరల్ అవేర్‌నెస్ - 25
ప్రశ్నలు -50 మార్కులు
3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25
ప్రశ్నలు -50 మార్కులు
4) ఇంగ్లిష్ లాంగ్వేజ్ -
25 ప్రశ్నలు -50 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.05.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
13.06.2022.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ఆగస్టు
2022.
ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది
నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.
0 Komentar