Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tamil Nadu Couple Secure 'No Caste, No Religion' Certificate for Child

 

Tamil Nadu Couple Secure 'No Caste, No Religion' Certificate for Child

తమ కుమార్తెకు కులం, మతం లేని ధృవపత్రం పొందిన తమిళనాడు తల్లిదండ్రులు

కుల, మతం పేరుతో తమ కుమార్తెను పరిమితం చేయకూడదనే నిర్ణయం

తమ కుమార్తెను ఎవరూ కుల, మతం పరంగా చూడకూడదని.. కేవలం ప్రేమతోనే ఆమెను చూడాలని భావించిన తల్లిదండ్రులకు ఆమెకు అరుదైన ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ చెందిన నరేశ్ కార్తీక్, గాయత్రి దంపతులకు మూడున్నరేళ్ల పాప ఉంది. తమ కుమార్తె విల్మా ను పాఠశాలలో చేర్పించాలని భావించిన వారు.. పలు స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అడ్మిషన్ ఫామ్ లోని కులం, మతం కాలమ్ లను నింపకుండా ఖాళీగా వదిలేశారు. కానీ ఆ కాలమ్ లను కచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందని, లేదంటే అడ్మిషన్ ఇవ్వలేమని ఆయా స్కూళ్లు స్పష్టం చేశాయి.

పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదని 1973 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలియని బాలిక దంపతులు.. తమ సమస్యను పరిష్కరించాలంటూ కోయంబత్తూర్ జిల్లా కలెక్టర్ జి.ఎస్. సమీరన్ ను సంప్రదించారు. తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ 1973, 2000 నాటి రెండు వేర్వేరు ఉత్తర్వుల ప్రకారం.. 'కులం లేదు, మతం లేదు' అని తల్లిదండ్రులు చెబితే కులం, మతం కాలమ్ లను ఖాళీగా ఉంచవచ్చు. ఇదే విషయాన్ని కలెక్టర్ సమీరన్ ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు.

కానీ రిజర్వేషన్ పరంగా ప్రభుత్వం నుంచి పొందే పథకాలు, వెసులుబాటులు అందబోవని స్పష్టం చేశారు. దీనికి అంగీకరించిన తల్లిదండ్రులు.. నోటరీ నుంచి ధ్రువీకరణ పొంది నార్త్ కోయంబత్తూర్ తహసీల్దారు అఫిడవిట్ సమర్పించారు. అనంతరం తమ కుమార్తె  విల్మా కోసం కులం లేదు, మతం లేదు ధ్రువపత్రాన్ని తీసుకున్నట్లు తండ్రి నరేశ్ వెల్లడించారు. కుల, మతం పేరుతో తమ కుమార్తెను నిర్బంధించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

'దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే సమానత్వం.. విద్యాసంస్థలు విద్యార్థులకు ప్రేమ, సమానత్వం నేర్పాలి' అని నరేష్ అన్నారు. చాలా మందికి ఇలాంటి ఓ సర్టిఫికెట్ ఉంటుందని తెలియదని పేర్కొన్న నరేష్. ఇకపై ఇలాంటి వీటిని పొందేందుకు మరికొందరు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags