Technical Teachers Certificate (TTC) - 42
Days Summer Training Course 2022 – Details Here
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్(టిటిసి)
- 42 రోజుల సమ్మర్ టైనింగ్ కోర్సు - 2022 – పూర్తి వివరాలు
ఇవే
====================
UPDATE 23-05-2022
====================
'టెక్నికల్ టీచర్స్
సర్టిఫికేట్ - 42 రోజుల సమ్మర్ టైనింగ్ కోర్సు - 2022"
నందు చేరుటకు అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.
అభ్యర్ధులు, ది.
05-05-2022 సాయంత్రం 05 గంటల నుండి ది.
15-05-2022 సాయంత్రం 05 గంటల లోపు వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకొనవచ్చును. తదుపరి, ది. 06-05-2022 నుండి ది. 16-05-2022 లోపు సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారిని ప్రవేశము నిమిత్తం
సంప్రదించవలెను.
అభ్యర్ధులు, ది.01-05-2022 నాటికి 18 సంవత్సరములు నిండినవారై ఉండాలి మరియు 45 సంవత్సరములు దాటియుండరాదు, మరియు 10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత కలిగియుండాలి. సాంకేతిక అర్హతలకు
సంబంధించి, సంబంధిత ట్రేడ్ నందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల
వారిచే జారీ చేయబడిన 'టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు (TCC)
- లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదా ట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్
ఎడ్యుకేషన్ & టైనింగ్ (S.B.T.E.T), ఆంధ్ర ప్రదేశ్ లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన I.T.I లచే జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టి ఫికేట్ లేదా నేషనల్ ఇన్సిస్ట్యూట్
ఆఫ్ హిండ్లూం వీవింగ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండ్సస్టీస్ మరియు కామర్స్ వారిచే
జారీ చేయబడిన సర్టిఫికేట్స్ లేదా తెలుగు విశ్వవిద్యాలయం వారిచే జారీ చేయబడిన
కర్నాటక సంగీతం నందు గాత్రం సర్టిఫికేట్స్ లేదా తత్సమానమైన సర్టిఫికేట్లు
కలిగియుండవలెను.
ఈ కోర్సుకు అవసరమైన అకడమిక్
సర్టిఫికేట్లు, టెక్నికల్ సర్టిఫికేట్లు మరియు అభ్యర్థి యొక్క ఫొటో &
సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయవలెను. ది. 15-05-2022 సాయంత్రం 05 గంటల తరువాత ఎట్టిపరిస్థితులలోనూ ఈ
కోర్సుకు ధరఖాస్తు చేసుకొనుటకు అనుమతించబడదు.
ఈ క్రింద తెలిపిన 05
కేంద్రములలో ది. 23-05-2022 నుండి ది.03-07-2022 వరకు (42 రోజులు ) కోర్సు నిర్వహించబడును.
విశాఖపట్టణము, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురము
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 05.05.2022
దరఖాస్తు చివరి తేది: 15.05.2022
===================
===================
0 Komentar