UGC-NET 2021-22: December 2021 and June
2022: All the Details Here
యూజీసీ - నెట్ డిసెంబర్ 2021 & జూన్ 2022: పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 08-07-2022
UGC NET 2022 అడ్మిట్ కార్డులు విడుదల....9 నుంచి
పరీక్షలు ప్రారంభం
పరీక్షల
తేదీలు:
జులై 09, 11 మరియు 12
ఆగస్టు 12, 13 మరియు 14.
> యూనివర్శిటీ
గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్ 2022) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింట్
ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
> ఈ
ఏడాది 2021 డిసెంబరు, 2022 జూన్ పరీక్షలను కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
> ఈ
రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు జులై 9,11,12 తేదీల్లో, అలాగే ఆగస్టు 12, 13, 14 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి.
> ఈ
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ http://nta.ac.in లేదా https://ugcnet.nta.nic లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా
సూచించింది.
> అప్లికేషన్
నంబర్, పుట్టినతేదీతో లాగిన్ అయ్యి అడ్మిట్
కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
> డౌన్‌లోడ్
చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా లేదా వివరాలలో తప్పులు దొర్లినా ఎన్టీఏ
హెల్ప్ లైన్ నంబర్ 011-4075 9000కు ఫోన్
చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.in కు మెయిల్
పంపవచ్చని యూజీసీ తెల్పింది.
======================
UPDATE 26-06-2022
జులై 8 నుంచి యూజీసీ నెట్ - డిసెంబరు 2021 మరియు జూన్ 2022 కలిపి
పరీక్షల నిర్వహణ
యూజీసీ నెట్
పరీక్షలు జులై 8వ తేదీన మొదలుకానున్నాయి. 2021 డిసెంబరు, 2022 జూన్ పరీక్షలను
కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పరీక్షల
తేదీలను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ జూన్ 25న ట్విటర్ ద్వారా ప్రకటించారు.
పరీక్షల తేదీలు:
జులై 09,
11 మరియు 12
ఆగస్టు 12, 13
మరియు 14.
The dates for the conduct of UGC-NET December 2021 and June 2022 merged cycles are 08, 09, 11, 12 July 2022 and 12, 13, 14 August 2022. The detailed date sheet will be uploaded soon on https://t.co/cUvZGrYigp and https://ugcnet.nta.nic
— Mamidala Jagadesh Kumar (@mamidala90) June 25, 2022
Best wishes to all the applicants. pic.twitter.com/wAcW62NLKf
======================
దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్
సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్ షిప్(ఆసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హతకు నిర్వహించే యూజీసీ-నేషనల్
ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)డిసెంబరు 2021 & జూన్ 2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
యూనివర్సిటీ గ్రాంట్స్
కమిషన్(యూజీసీ)-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), డిసెంబరు 2021
& జూన్ 2022:
అర్హత: హ్యూమానిటీస్, సోషల్
సైన్సెస్ (లాంగ్వేజెస్ ని కలుపుకొని), కంప్యూటర్ సైన్స్ అండ్
అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ప్రస్తుతం
మాస్టర్స్ డిగ్రీ చదువుతన్న వారు, మాస్టర్స్ డిగ్రీ చివరి
ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
వయసు: జేఆర్ఎఫ్ నకు దరఖాస్తు
చేసుకునే అభ్యర్థుల వయసు 01.06.2022 నాటికి 31
ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసుతో
సంబంధం లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో ఉంటాయి. పరీక్షా సమయం మూడు గంటలు(180 నిమిషాలు) ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ అండ్ హిందీ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా విధానం కింది విధంగా ఉంటుంది.
* పేపర్-1 100 మార్కులు 50 ప్రశ్నలు
* పేపర్-2 200 మార్కులు 100 ప్రశ్నలు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 30.04.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022.
పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి
ఉంది.
0 Komentar