UPSC CDS (2) Exam 2022: Results Released
యూపీఎస్సీ - సీడీఎస్ ఎగ్జామ్ (2), 2022: ఫలితాలు విడుదల
======================
UPDATE 23-09-2022
కంబైన్డ్
డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ-2)- 2022 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించింది. మొత్తం 6658 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ పేర్కొంది.
ఇండియన్ మిలటరీ
అకాడమీ,
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్
అకాడమీ,
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలలో నియామకానికి యూపీఎస్సీ రాత
పరీక్షలు నిర్వహించింది. పూర్తి సమాచారాన్ని వెబ్ సైట్ లో ఉంచినట్లు యూపీఎస్సీ
పేర్కొంది. త్రివిధ దళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధిచిన
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ను (సీడీఎస్ఈ) యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తున్న
విషయం తెలిసిందే.
======================
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)(2), 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్
ఎగ్జామ్ (2), 2022
మొత్తం ఖాళీలు: 339
1) ఇండియన్ మిలటరీ అకాడమీ,
దేహ్రాడూన్ - 100
2) ఇండియన్ నేవల్ అకాడమీ,
ఎజిమళ - 22
3) ఎయిర్ ఫోర్స్ అకాడమీ,
హైదరాబాద్ - 32
4) ఆఫీసర్స్ ట్రైనింగ్
అకాడమీ, చెన్నై – 169
5) ఎస్ఎస్ సీ విమెన్ (నాన్
టెక్నికల్) - 16
అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్
డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్బి
ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, వరంగల్,
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు.
ఇతరులు రూ.200 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 18.05.2022.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 07.06.2022.
దరఖాస్తుల ఉపసంహరణ: 14.06.2022 నుంచి 20.06.2022 వరకు.
పరీక్ష తేది: 04.09.2022.
0 Komentar