JVK KIT – Vidya Kanuka Kit Distribution Guidelines
2022-2023
విద్యా కానుక - 2022-23 విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా -
మార్గదర్శకాలు జారీ
ఆర్.సి.నెం. SS-16021/50/2021-CMO
SEC-SSA తేది: 10-05-2022
విషయం: సమగ్ర శిక్షా 'జగనన్న
విద్యా కానుక - 2022-23 విద్యార్థులకు కిట్లను
క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా - మార్గదర్శకాలు జారీ చేయుట.
ఆదేశములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022- 23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, మండల ప్రజాపరిషత్,
జిల్లా పరిషత్, మున్సిపల్, గురుకులాలు, ఆశ్రమ, ఎయిడెడ్,
మోడల్, కేజీబీవీ, రిజిస్టర్డ్
మదర్సాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా
ఆధ్వర్యంలో “జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్ల
సరఫరా ప్రారంభించబడింది..
జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర
శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ఈ క్రింది ఏర్పాట్లను తప్పనిసరిగా
అమలు చేయవలెను.
1. జిల్లా స్థాయిలో జగనన్న
విద్యాకానుక కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి.
2. సప్లయర్స్ నుండి
వస్తువుల డెలివరి షెడ్యూల్ ను తీసుకుని సంబంధిత స్కూల్ కాంప్లెక్స్
ప్రధానోపాధ్యాయులకు / మండల విద్యాశాఖాధికారి వారికి ఏ రోజు ఏ వస్తువులు అందుతాయో
సమాచారం అందించాలి.
3. జగనన్న విద్యాకానుక
వస్తువులకు సంబంధించి డెలివరీ చలానాలను తప్పనిసరిగా పొందవలెను.
4. ప్రతి రోజు జిల్లాలో
విద్యాకానుక వస్తువుల స్వీకరణ గురించి నివేదిక పంపించవలెను.
5. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ మరియు డిక్షనరీలు స్కూల్
కాంప్లెక్సులకు చేర్చి పాఠశాల పున:ప్రారంభానికి ముందుగా 'స్టూడెంట్
కిట్' తయారు చేయాలి.
0 Komentar