YUVIKA 2022 Programme Starts from Today
(May 16) -
నేటి నుంచి ఇస్రో యువికా శిక్షణ ప్రారంభం
- కార్యక్రమానికి 150 మంది విద్యార్థులు ఎంపిక – తెలుగు రాష్ట్రాల ఎంపికైనా
10 మంది విద్యార్ధులు వీరే
గ్రామీణ ప్రాంతాలకు
ప్రాధాన్యమిస్తూ పాఠశాలల విద్యార్థుల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)-2022 సోమవారం నుంచి
రెండు వారాలపాటు జరగనుంది. ఇస్రో కేంద్రాలైన వీఎస్‌ఎస్‌సీ (తిరువనంతపురం), యూఆర్‌ఎస్‌సీ (బెంగళూరు), ఎస్‌ఏసీ (అహ్మదాబాద్),
ఎన్‌ఈఎస్‌ఏసీలో (షిల్లాంగ్) అంతరిక్ష శాస్త్ర అంశాలపై సీనియర్
శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులను షార్‌కు
తీసుకొచ్చి ప్రయోగ వేదికలను చూపించనున్నారు.
కార్యక్రమానికి దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర
పాలిత ప్రాంతాల నుంచి 150 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులను
ఎంపిక చేశారు. వీరికి అవసరమైన ఖర్చులన్నీ ఇస్రోనే భరించనుంది. ఏపీ నుంచి
హేమచంద్ర సాయి, బి.జ్యోతిరాదిత్య, కె.లక్ష్మీ సౌజన్య, ఎం.క్రాంతి కుమార్, వీసీఎన్ కృష్ణతేజ, తెలంగాణ నుంచి ఎ.భవిష్య, డి.ప్రత్యూష, జి.రాహుల్, ఆర్.సానియా,
సి.విజయ ఎంపికయ్యారు.
0 Komentar