Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

"10 Lakh Jobs In 18 Months": PM's Order for Hiring New Jobs in the Country

 

"10 Lakh Jobs In 18 Months": PM's Order for Hiring New Jobs in the Country

"18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు": దేశంలో కొత్త ఉద్యోగాల నియామకానికి ప్రధానమంత్రి ఆదేశం

ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) మంగళవారం ట్వీట్ చేసింది.

అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవనరుల స్థితిగతులను సమీక్షించిన మీదట మోదీ నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవవనరుల స్థితిగతులను ప్రధాని మోదీ సమీక్షించారు. అనంతరం 10 లక్షల నియామకాలపై ఆదేశాలు ఇచ్చారు.

వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేశారు అని పీఎంఓ పోస్టు పెట్టింది. ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల గురించి కేంద్రం దృష్టికి వెళ్ళటం వల్ల ఉద్యోగ నియామకాలపై తాజా ఆదేశాలు వచ్చాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags