Agneepath Scheme 2022: AgniVeer Rally
Notification Released – Details Here
అగ్నిపథ్ పథకం:
ఆర్మీలో అగ్నివీరుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే
జులై నుంచి రిజిస్ట్రేషన్
ప్రక్రియ ప్రారంభం
సాయుధ
బలగాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ (Agnipath) పథకానికి సంభందించి ఆర్మీలో అగ్నివీరుల (Agniveer) నియామకాల కోసం భారత సైన్యం తాజాగా నోటిఫికేషన్ జారీ
చేసింది.
ఇందుకోసం
జులై నుంచి రిజిస్టేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నివీరులుగా నియామకాలు
చేపట్టే విభాగాలు అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్లో వివరంగా
పేర్కొంది. అంతేకాకుండా అగ్నివీరులకు ఇచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు
సంబంధించి పూర్తి వివరాలను నోటిషికేషన్ లో పొందుపరిచింది.
కేంద్ర
ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద
ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అగ్నిపథ్ (Agnipath) పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన త్రివిధ
దళాల ఉన్నతాధికారులు.. సైన్యంలో సరాసరి వయసును తగ్గించే లక్ష్యంతోనే ఈ సంస్కరణలను
తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆర్మీ నేడు నోటిఫికేషన్ జారీ
చేసింది.
మరోవైపు వాయు
సేన,
ఇండియన్ నేవీలకు సంబంధించిన అగ్నివీరుల నియామాక
నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే, నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు (Agniveers) రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల
నియామకాల్లోనూ 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామని
కేంద్రం ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
0 Komentar