Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Alert! Check These Malware Apps on Google Play Store - Delete from Your Phone Now

 

Alert! Check These Malware Apps on Google Play Store - Delete from Your Phone Now

మీ మొబైల్ లో ఈ ఐదు యాప్స్ ఉంటే అన్ ఇన్స్టాల్ చేసేయండి – వివరాలు ఇవే

గూగుల్ ప్లే స్టోర్‌లో మాల్వేర్‌తో కూడిన యాప్‌లు: ఏదైనా యాప్ స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు డౌన్‌లోడ్‌లు మరియు రేటింగ్‌లను ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారు. ఈ యాప్‌లు అధీకృతమని వారిని నమ్మేలా చేస్తుంది.

కానీ, అలా చేస్తే సరిపోదు. ఎందుకంటే, ఇప్పుడు ఎక్కువగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు (మాల్వేర్ యాప్‌లు) కూడా మీ ఫోన్‌కు ప్రమాదకరంగా మారవచ్చు. ఇవి స్పైవేర్ యాప్ లు పనిచేస్తూ మొబైల్ లోని ఇతర యాప్ ల నుంచి డేటాను తస్కరిస్తున్నాయట. ఇవి మీ మొబైల్ లో ఉంటే అన్ ఇన్స్టాల్ చేసేయండి. 

1.  పీఐపీ పిక్ కెమెరా ఫొటో ఎడిటర్ (PIP Pic Camera Photo Editor):

ఈ యాప్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్. ఇందులోని మాల్వేర్ ఫేస్బుక్ లాగిన్ వివరాలను దొంగలిస్తోందట. దీనిని పది లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం.

2.  వైల్డ్ & ఎక్సోటిక్ యానిమల్ వాల్ పేపర్ (Wild & Exotic Animal Wallpaper):

ఈ యాప్ లో మాస్క్వెరేడింగ్ (masquerading) అనే యాడ్వెర్ ఉంటుంది. ఇది మొబైల్ లోని ఇతర యాప్ ల  ఐకాన్ ను, పేరును మారుస్తుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇక ఈ యాప్ ను 5 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారట.

3. జోడి హారోస్కో ప్ - ఫార్చ్యూన్ ఫైండర్ (Zodi Horoscope - Fortune Finder):

ఈ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లోకి ప్రవేశించిన మాల్వేర్ ఫేస్ బుక్ ఖాతా వివరాలను తస్కరిస్తోంది. దీన్ని కూడా 5 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారట.

4. పీఐపీ కెమెరా 2022 (PIP Camera 2022):

కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు ఈ యాప్ ను వాడుతుంటారు. ఈ యాప్ ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్వేర్ ద్వారా ఫేస్ బుక్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తోంది. ఈ యాపు 50 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం.

5. మ్యాగ్నిఫయర్ ప్లాష్ లైట్ (Magnifier Flashlight):

ఈ యాప్ లో వీడియో, స్టాటిక్ బ్యానర్ యాడ్స్ ఎక్కువగా వస్తాయి. సైబర్ నేరగాళ్లు వీటి నుంచి యాడ్ వేర్ ను ఫోన్లోకి పంపి డేటాను సేకరిస్తున్నారు. దీనిని 10 వేల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

యాప్స్ లో మాల్వేర్ ఎలా పనిచేస్తుంది?

ఆండ్రాయిడ్ యాప్స్ (Android Apps) ఉపయోగించే యూజర్లకు మాల్వేర్ ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా డేటా చోరికి పాల్పడుతూనే ఉంటుంది. యాప్ లు  తరచుగా యాడ్స్ (Ads)ను తీసుకొస్తూ యూజర్లను వాటిపై క్లిక్ చేయాలని పదేపదే అడుగుతూ ఉంటోంది. ఒకవేళ యూజర్ క్లిక్ చేస్తే మాల్వేర్ ఫోన్ లోకి ప్రవేశిస్తుంది. యూజర్ల ముఖ్యమైన సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటాను సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది.

మాల్వేర్ ను అడ్డుకోవడం ఎలా..?

ఫోన్లో మాల్వేర్ / వైరస్ ఉన్నట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా యాంటీ వైరస్ లేదా యాంటీ మాల్వేర్ ప్రోగ్రాం ఇన్స్టాల్ చేసుకోమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఫోన్ ని పూర్తిగా స్కాన్ చేసి ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్ ఉంటే గుర్తించి రిపోర్టు చూపిస్తాయి.

ఫోన్లో మాల్వేర్ తొలగించేందుకు ఉన్న మరో మార్గం ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్. ఇలా చేయడం వల్ల ఫోన్ లో ఇన్ స్టాల్ చేసిన అన్ని యాప్ లు డిలీట్ అయిపోయి, ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉన్నాయో... అలా సెట్టింగ్స్ వస్తాయి. ఫోన్ ప్యాక్టరీ రీసెట్ చేయాలంటే కాంటాక్ట్స్ తో పాటు ఇతర డేటాను బ్యాకప్ చేసుకోవడం మరిచిపోకండి.

Previous
Next Post »
0 Komentar

Google Tags