ఏపీ ప్రభుత్వం ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ 'బైజూస్'తో ఒప్పందం - వివరాలు ఇవే
ప్రభుత్వ
పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం
చేసేందుకు ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ 'బైజూస్'తో ఒప్పందం చేసుకుంది.
ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం పై ప్రభుత్వ అధికారులు, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్
మాట్లాడుతూ.. బైజూతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందంతో
ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు
ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఎడ్యు-టెక్ విద్యను అందించనున్నట్లు
చెప్పారు. బైజూస్ ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాల రూపకల్పన
చేయనున్నట్లు తెలిపారు. వీటితో విద్యార్థులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలుంటుందన్నారు.
మరోవైపు ఏటా
8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వనున్నట్లు సీఎం జగన్
వెల్లడించారు. ఈ సెప్టెంబరులోనే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తామని వివరించారు.
వీడియో కంటెంట్ ద్వారా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా తరగతి గదిలో టీవీలూ ఏర్పాటు
చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.
0 Komentar