గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ గురించి ఏపీ ప్రభుత్వం
శుభవార్త - ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసే దస్త్రం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి
గురువారం సంతకం చేశారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, డిపార్ట్ మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు.
ఈ అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. దీనికి సంబంధించిన అధికారిక
ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశముంది.
సచివాలయ
ఉద్యోగులకు పాత స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించినప్పటికీ
... జులై నెల వేతనాలు కొత్త పీఆర్సీ ప్రకారమే ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు
సమాచారం. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే కొత్త వేతనాలు అందనున్నాయని
తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40వేల మందికి
పైగా సచివాలయ ఉద్యోగులు ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్ మెంటల్ పరీక్షలో
ఉత్తీర్ణులైనట్టు సమాచారం.
0 Komentar