AP TET 2022: All
the Details Here
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2022: ముఖ్యమైన వివరాలు ఇవే
===================
UPDATE 30-09-2022
ఉపాధ్యాయ
అర్హత పరీక్ష (టెట్)లో 58.07% మంది అర్హత సాధించినట్లు పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. టెట్ ను ఆన్లైన్లో
విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు.
మొత్తం 150 మార్కులకు జనరల్ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్ కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను శుక్రవారం (Sep 30) నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
===================
UPDATE 14-09-2022
===================
UPDATE 01-09-2022
===================
UPDATE 23-08-2022
RESPONSE SHEETS
AVAILABLE 👇
===================
UPDATE
27-07-2022
===================
MOCK TEST
LINKS: 👇
===================
UPDATE 26-07-2022
APTET 2022: సబ్జెక్ట్ వారీగా మరియు సెషన్ వారీగా పరీక్ష షెడ్యూల్ ఇదే
===================
UPDATE
23-07-2022
👉Once candidate login open అయ్యాక...
👉మీకు left side ఒక bubble ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి
👉అది క్లిక్ చేస్తే
అపుడు మీకు candidate service అని ఒక option left side
top corner లో కనిపిస్తుంది
👉అది ok చేస్తే exam centre option కనిపిస్తుంది.
👉open చేసి మీకు నచ్చిన
సెంటర్ ఇచ్చుకోవాలి
Choose Exam Center Service Available Now. 👇
===================
UPDATE 13-07-2022
డిగ్రీలో 40 % వచ్చినా టెట్ కు అర్హులే
డిగ్రీలో 40 శాతం మార్కు లు పొంది బీఈడీ ఉత్తీర్ణులైన ఎస్సీ , ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులందరూ టెట్ పేపర్ 2ఏ రాయవచ్చని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ మంగళవారం ఒక ప్రకటన
విడుదల చేశారు.
అయితే ఈ
ఒక్కసారి మాత్రమే ఈ అవకాశము ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలను
ఇప్పటికే టెట్ వెబ్సైట్ లో పొందుపరిచారు.
===================
టెట్ సిలబస్
అకాడమీ టెక్స్ట్ బుక్ లోని పేజీ నంబర్లతో by అశోక్ స్టడీ సర్కిల్
===================
టెట్ సిలబస్ తెలుగులో
by తిరుపతి
శ్రీప్రజ్ఞ
===================
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత
పరీక్ష'
(ఏపీ టెట్ ఆగస్టు-2022) ప్రకటనను విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు
పేపర్-2(ఎ, బి)లో అర్హత
సాధించాల్సి ఉంటుంది.
అర్హతలు:
పేపర్ ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్/
యూజీడీపీఈడీ/ డీపీఈడీ/ బీపీఈడీ లేదా తత్సమానం. 2020-22 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు అర్హులే.
కమ్యూనిటీ
వారీ ఉత్తీర్ణతా మార్కులు
1. ఓసీ(జనరల్)- 60% మార్కులు ఆ పైన
2. బీసీ- 50% మార్కులు ఆ పైన
8. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్ మెన్- 40% మార్కులు ఆ పైన
పరీక్ష
కేంద్రాలు: ఏపీకి చెందిన అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.
పరీక్ష
విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్ లైన్ పరీక్ష
పరీక్ష
రుసుము: రూ.500
దరఖాస్తు
విధానం: ఆన్లైన్.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల: జూన్ 10న
దరఖాస్తు
రుసుములు చెల్లింపులు: జూన్ 15 నుంచి జులై 15 వరకు.
ఆన్లైన్లో
దరఖాస్తుల సమర్పణ: జూన్ 16 నుంచి జులై 16 వరకు.
హెల్ప్
డెస్క్ సేవలు: జూన్ 13 నుంచి ప్రారంభం.
ఆన్ లైన్
మాక్ టెస్ట్ సదుపాయం: జులై 26 నుంచి
హాల్
టిక్కెట్ డౌన్ లోడ్: జులై 25 నుంచి
పరీక్షల
నిర్వహణ: 06.08.2022 నుంచి 21.08.2022 వరకు.
ప్రాథమిక 'కీ' విడుదల: 31.08.2022.
అభ్యంతరాల
స్వీకరణ: 01.09.2022 నుంచి 07.09.2022.
తుది కీ
విడుదల: 12.09.2022.
ఫలితాల
ప్రకటన: 14.09.2022.
పరీక్ష సమయం:
సెషన్-1:
ఉదయం 9.30 గంటల నుంచి
మధ్యాహ్నం 12 వరకు
సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు
===================
===================
UPDATE 09-06-2022
ఉపాధ్యాయ
అర్హత పరీక్ష (టెట్)-2022కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 6 నుంచి ఆన్లైన్లో
ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షలు ఎన్ని రోజులు
నిర్వహించాలో నిర్ణయిస్తారు. జూన్ 15 నుంచి జులై 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం హాల్ టికెట్లు జారీ
చేస్తారు.
జాతీయ
ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి
ఉండగా.. గతేడాది మార్చిలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఏడాది ఒక్కసారే
నిర్వహించాలనే నిబంధన తీసుకొచ్చింది.
2018లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)తో కలిపి టెట్ నిర్వహించారు. ఈసారి టెట్
నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు
ఉండగా గతేడాది ఎన్సీటీఈ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా సవరించింది. పాఠశాల
విద్యాశాఖ టెట్ ప్రకటనను శుక్రవారం (జూన్ 10) విడుదల చేస్తారు.
===================
0 Komentar