Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS: Intermediate (First Year) Admissions 2022-23 - Details Here

 

APMS: Intermediate (First Year) Admissions 2022-23 - Details Here

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2022-23 విద్యాసంవత్సరములో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశము కొరకు ప్రకటన వివరాలు ఇవే

ఆంధప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్(ఆదర్శ పాఠశాలల)లో 2022-2023 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా MPC/BIPC/MEC/CEC గ్రూప్ లలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు |

ప్రవేశ అర్హతలు :

1. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసికోవాలి . దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు APMS వెబ్సైటు చూడగలర

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ. 05.06.2022 నుండి 16.06.2022 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ బడును. ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకొనవలయును.

2. దరఖాస్తు చేయడానికి రుసుము: OC మరియు B C లకు రూ 150/- (అక్షరములా నూటఏభై రూపాయలు మాత్రమే ) SC మరియు ST లకు రూ 100/- (అక్షరములా వంద రూపాయలు మాత్రమే).

3. ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

దరఖాస్తు చివరి తేదీ: 23-06-2022 

DATE EXTENSION PROCEEDINGS

NOTIFICATION & SCHEDULE

PRESS NOTE

PAYMENT

APPLY HERE 

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags