AUEET-2022: Andhra
University Engineering Entrance Test – Counselling Schedule Details Here
ఆఈట్-2022: ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ – కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల
==================
UPDATE 25-07-2022
==================
UPDATE 21-07-2022
ఆఈట్ ప్రవేశాల
కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్ర
విశ్వవిద్యాలయం లో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన
ఆఈట్ 2022 కౌన్సెలింగ్ ప్రక్రియను ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య
డి.ఎ.నాయుడు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ నెల 22వ తేదీ నుంచి తమ ర్యాంక్ కార్డులను ప్రవేశాల సంచాలకుల వెబ్
సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
25న
రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించి కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ
అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500 ప్రవేశ కౌన్సెలింగ్ రుసుంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
సీఏపీ,
పీహెచ్ విభాగాల వారికి 27న
పెదవాల్తేరులోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన
జరుపుతారు. 27, 28 తేదీల్లో ఎస్సీసీ, క్రీడా విభాగాల వారు తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి
ఉంటుంది. ఇతర అభ్యర్థులంతా తమ సర్టిఫికెట్లను 27 నుంచి 31వ తేదీ వరకు అప్లోడ్ చేయాలి. వెబ్
ఆప్షన్లు ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఇవ్వాలి. తొలిదశ సీట్ల కేటాయింపు ఆగస్టు 7న ఉంటుంది.
==================
UPDATE 20-07-2022
ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష (ఆఈట్-2022) ఫలితాలను రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన GVSD.సూర్యనారాయణమూర్తి 88 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, విశాఖ నగరానికి చెందిన P.ప్రతీక్ 85 మార్కులతో రెండో ర్యాంకు, JVS. రామలక్ష్మి 84 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.
==================
UPDATE 15-07-2022
పరీక్ష తేదీ:
17-07-2022
==================
విశాఖపట్నంలోని
ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ
ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఆఈట్ 2022) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.
కోర్సు
వివరాలు: బీటెక్, ఎంటెక్ డ్యూయల్
డిగ్రీ ప్రోగ్రామ్ లు
1. బీటెక్,
ఎంటెక్ (సీఎస్ఈ): 360 సీట్లు
2. బీటెక్,
ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్
ఇంజినీరింగ్): 60 సీట్లు
3. బీటెక్,
ఎంటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్): 30 సీట్లు
4. బీటెక్,
ఎంటెక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్
ఇంజినీరింగ్): 30 సీట్లు
అర్హత: కనీసం
45% మార్కులతో గణితం, ఫిజిక్స్,
కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణత
(రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).
ఎంపిక
ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
పరీక్ష
కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం,
విజయవాడ, గుంటూరు, తిరుపతి,
కడప.
దరఖాస్తు
రుసుము: రూ.1,200
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 22-05-2022.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 22-06-2022. 08-07-2022
హాల్ టికెట్
డౌన్లోడ్ ప్రారంభం: 28-06-2022.
ప్రవేశ
పరీక్ష తేది: 30-06-2022. 17-07-2022
ఫలితాల
విడుదల: 02-07-2022. 20-07-2022
ప్రవేశాల
ప్రక్రియ ప్రారంభం: 08-07-2022. 23-07-2022
0 Komentar