Centre to set up
model schools, to be called ‘PM Shri schools’: Education minister
దేశవ్యాప్తంగా 'పీఎం శ్రీ పాఠశాలలు’ ఏర్పాటు చేయనున్న కేంద్రం - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఆధునిక
ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 'పీఎం శ్రీ పాఠశాలల’ను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
జాతీయ నూతన
విద్యా విధానానికి (NEP) ఈ పాఠశాలలు
ప్రయోగశాలల వంటివని ఆయన అభివర్ణించారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో రెండు రోజుల
పాటు నిర్వహించిన విద్యా మంత్రుల జాతీయ సదస్సులో గురువారం మంత్రి ప్రసంగించారు. ఈ
సందర్భంగా కొత్త పాఠశాలల ఏర్పాటు విషయాన్ని వెల్లడించారు.
విద్యార్థులను
భవిష్యత్తుకు సర్వసన్నద్ధులను చేసేలా అత్యాధునిక హంగులతో 'పీఎం శ్రీ పాఠశాలల'ను ఏర్పాటు
చేయనున్నామని వెల్లడించారు. పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి మాతృ భాషలో
ప్రారంభమయ్యే విద్యా బోధన విద్యార్థులను 21వ శతాబ్దపు
విశ్వ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యమిస్తుందన్నారు.
అన్నీ జాతీయ
భాషలే
నూతన విద్యా
విధానంలో ప్రాంతీయ భాషలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
గుర్తుచేస్తూ... దేశంలోని అన్ని భాషలూ జాతీయ భాషలే. ఏ భాష కూడా హిందీ, ఆంగ్లం కన్నా తక్కువేమీ కాదు. ప్రతి భాషకు దానిదైన ప్రత్యేకత, ప్రాధాన్యం ఉంటుంది. అందువల్లే నూతన విద్యా విధానంలో
స్థానిక భాషలకూ ప్రాముఖ్యత కల్పించామ'ని తెలిపారు.
We cannot deprive our new generation from 21st century knowledge and skills.
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 2, 2022
We are in the process of establishing PM Shri schools which will be fully equipped to prepare students for the future. These state-of-the-art schools will be the laboratory of NEP 2020. pic.twitter.com/Msefbv1t6R
0 Komentar