35 In English, 36 In Maths: Class 10
Marksheet of a Collector Goes Viral
పదవ తరగతి విద్యార్థులు
తక్కువ మార్కులొస్తే కుంగిపోవద్దు - ఆంగ్లంలో 35, గణితంలో 36 - కలెక్టర్ తుషార్ 10వ తరగతి మార్క్‌షీట్ వైరల్
విద్యార్థులు
పరీక్షలలో అనుకున్న మార్కులు రాకపోతే ఆత్మహత్య.. ఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా బలవన్మరణం. ఏమీ సాధించలేమన్న భయం, అపోహతో కొంతమంది విద్యార్థులు భావోద్వేగానికి గురై
క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాలివీ.
కానీ ఓ
సాధారణ విద్యార్థి, అత్తెసరు మార్కులతో
పది పాసైనవారు కూడా ఆ తర్వాత గొప్పగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చని
నిరూపిస్తోంది ఓ కలెక్టర్ మార్కుల జాబితా. ఇంగ్లీష్ లో 35, గణితంలో 36.. ఇవీ ప్రస్తుతం
కలెక్టర్ (IAS) హోదాలో ఉన్న తుషార్ డి సుమేరా పదిలో
సాధించిన మార్కులు.
పలు
రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సుమేరా ఫొటోతోపాటు ఆయన
మార్కుల మెమోను మరో ఐఏఎస్ అధికారి ట్విటర్ లో పంచుకున్నారు. తక్కువ మార్కులొస్తే
కుంగిపోవద్దని తెలియజేసేలా సుమేరా మార్కుల జాబితాను 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనిశ్ శరణ్ తన ట్విటర్ ఖాతాలో
పంచుకున్నారు. 'పదో తరగతిలో సుమేరా కేవలం పాస్
మార్కులనే సాధించారు. ఆయనకు 100కు ఇంగ్లీష్ లో 35, గణితంలో 36 మార్కులే వచ్చాయి.
ఈ మార్కులు చూసి నువ్వేం సాధించలేవు అని చాలామంది అన్నారు' అంటూ రాసుకొచ్చారు.
ఈ ట్వీట్
ప్రస్తుతం వైరల్ గా మారింది. అవనిశ్ శర్మ ట్వీటకు సుమేరా స్పందిస్తూ.. ధన్యవాదాలు
తెలియజేశారు. 2012 బ్యాచ్ కు చెందిన సుమేరా ప్రస్తుతం
గుజరాత్ లోని భరుచ్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ లో
డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూపీఎస్సీలో ర్యాంకు సాధించారు. అంతకుముందు ఓ పాఠశాల
ఉపాధ్యాయునిగా పనిచేశారు.
Thank You Sir https://t.co/MFnZ7vSICz
— Tushar D. Sumera,IAS (@TusharSumeraIAS) June 11, 2022
0 Komentar