England break
one-day world record after smashing 498 against Netherlands
వన్డేల్లో
అత్యధిక స్కోరు - 498 పరుగులతో ప్రపంచ రికార్డు
సృష్టించిన ఇంగ్లండ్ టీం
ఇప్పటికే వన్డేల్లో
అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లాండ్.. మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమ్ స్టైల్
వీన్ వేదికగా నెదర్లాండ్స్ తో జరుగుతోన్న తొలి వన్డేలో 498/4 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి తన
రికార్డును తానే అధిగమించింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ చేసిన 481 పరుగులే వన్డేల్లో అత్యధిక స్కోరు. ఒక్క ఇంగ్లాండ్
ఇన్నింగ్స్ లోనే మొత్తం 26 సిక్సర్లు, 36 ఫోర్లు నమోదయ్యాయంటే విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం
చేసుకోవచ్చు.
మూడు వన్డేల
సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి
ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ మొదట్లో ఇంగ్లాండ్ ఓపెనర్ రాయ్ (1) పెవిలియన్ చేరాడు. ఇదొక్కటే నెదర్లాండ్స్ కు ఊరట నిచ్చే
అంశం. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లంతా దూకుడగానే ఆడారు. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 122 (93) చెలరేగి ఆడి తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. డేవిడ్ మలన్
125
(109)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
తరవాత వచ్చిన
జాస్ బట్లర్ 162*(70) ఆకాశమే హద్దుగా సిక్సర్లతో
విరుచుకుపడ్డాడు. మోర్గాన్ (0) అవుట్ అయ్యాక క్రీజ్
లోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ 66*(22) సైతం విరుచుకుపడ్డాడు. దీంతో ఓ దశలో జట్టు స్కోరు 500 దాటేలా కనిపించింది. చివరికి రెండు పరుగుల దూరంలో
నిలిచిపోయింది.
వన్డేల్లో
ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కో ర్లెన 498/4 (ఈ మ్యాచ్ లో), 481/6 - (ఆస్ట్రేలియాపై), 444/8(పాకిస్థాన్ పై) అన్నీ ఇంగ్లాండ్ పేరిటే నమోదయ్యాయి.
0 Komentar