Evtric Rise
Electric Motorcycle Launched in India at Rs 1.60 Lakh
ఈవీట్రిక్ తొలి
మోటార్ సైకిల్ - ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ ప్రయాణం
విద్యుత్
వాహన తయారీ సంస్థ ఈవీట్రిక్ తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను బుధవారం విడుదల
చేసింది. దీని ధర రూ.1.60 లక్షలు (ఎక్స్
షోరూం). అలాగే తమ ఇ-బైక్ ఈవీట్రిక్ రైజ్ బుకింగ్లు కూడా ప్రారంభిస్తున్నట్లు
ప్రకటించింది. నేటి నుంచి రూ. 5,000 చెల్లించి రైజ్ ను
బుక్ చేసుకోవచ్చు.
రాజస్థాన్ లో జరిగిన డీలర్ల సమావేశంలో మోటార్ సైకిల్ ను ఈవీట్రిక్ విడుదల చేసింది. దీని గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. 2000 వాట్ల బీఎల్ డీసీ మోటార్‌ను అమర్చారు. దీన్ని నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు.
పీఏపీఎల్ ఆటోమేషన్ కంపెనీలో భాగమే ఈవీట్రిక్ మోటార్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, బైలు, త్రిచక్ర వాహనాల తయారీయే లక్ష్యంగా ఈవీట్రిక్ ఈ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ కంపెనీ యాక్సిస్, రైడ్, మైటీ పేరిట మూడు ఇ-స్కూటర్లను విడుదల చేసింది. మొత్తం 22 రాష్ట్రాల్లో 125 టచ్ పాయింట్ల ద్వారా ఈ వాహనాలను విక్రయిస్తున్నారు.
Evtric is going to bring revolution in the field of Electric Motors. Evtric presents the all-new Electric Bike loaded with amazing features.
— EVTRIC Motors Pvt Ltd (@EvtricL) June 17, 2022
Hurry Up, Get your Evtric Bike Today!!
A Step toward saving the environment.#evtric #evtricmotors #electricpower #EvtricBike #ElectricBike pic.twitter.com/2FiVDloyGb
0 Komentar