Father’s Day:
History and Importance, Why Do We Celebrate
నేడు ప్రపంచ పితృదినోత్సవం
- చరిత్ర మరియు ప్రాముఖ్యత – వివరాలు ఇవే
తాను కరుగుతూ
పిల్లల జీవితంలో వెలుగులు నింపే నాన్నకు వందనం..
కన్న పేగు అమ్మదే ... కానీ తన పిల్లల్ని కంటి రెప్పలా కాపాడి.. మంచి చెడులను నేర్పి సమాజంలో ఓ గుర్తింపు నిచ్చేలా చేసేది ఖచ్చితంగా నాన్న పెంపకమే. అవును అమ్మ అంటే ప్రేమే.. కానీ నాన్న అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ.. నాన్న నమ్మకం.
పిల్లలందరి జీవితంలో తల్లికి ఎంత ప్రాముఖ్యత ఉందో తండ్రికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తల్లి జన్మనిస్తే , తండ్రి తన పిల్లల్ని కాపాడడానికి , తన పిల్లలు కనే ప్రతి కలని నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడతాడు. నాన్న ఎన్ని త్యాగాలు చేసైనా సరే.. తన పిల్లల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటాడు. నాన్న ఎన్ని త్యాగాలు చేసినా.. సమాజంలో పిల్లలపై తల్లికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత.. విషయంలో నాన్న కొంచెం వెనుకబడ్డాడేమో.. అయితే తండ్రి నిస్వార్థ ప్రేమను గౌరవించటానికి ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డే గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఫాదర్స్ డే చరిత్ర గురించి తెలుసుకుందాం..
ఫాదర్స్ డే ఎలా మొదలైందంటే.. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ పితృదినోత్సవాన్ని ప్రారంభించింది. ఆమెకు తల్లి లేదు. దీంతో సోనోరా స్మార్ట్ డాడ్ జీవితంలో తల్లి , తండ్రి అన్నీ తానై నాన్న పెంచాడు. తన తండ్రికి తన పట్ల ఉన్న నిస్వార్థ ప్రేమ.. అంకితభావాన్ని చూసి.. డాడ్ తన తండ్రిని గౌరవిస్తూ.. ఒకరోజు ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదని భావించింది. దీంతో తండ్రి గొప్పదనం చెబుతూ.. గుర్తింపుకి ఒక రోజు ఉండాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో అమెరికాలో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.
అనంతరం 1916 సంవత్సరంలో US అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఫాదర్స్ డేని జరుపుకోవాలనే సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తరువాత , 1966 సంవత్సరంలో , ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ జూన్ మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డేని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి పితృదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం జరుపుకుంటున్నారు.
ఫాదర్స్ డే ప్రాముఖ్యత
ఒక తండ్రి తన జీవితమంతా పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడానికి , వారి చిన్న , పెద్ద అవసరాలను తీర్చడానికి తన జీతాన్ని జీవితాన్ని వెచ్చిస్తాడు. అయితే తండ్రి ప్రేమని త్యాగాన్ని గుర్తిస్తూ.. నాన్నకి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పము. కనీసం ఒక్కరోజైనా రాత్రింబగళ్లు కష్టపడే నాన్న కృషి , ప్రేమ. తండ్రి ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఇది నాన్నని గౌరవించే రోజు. ఈ రోజున మీరు మీ తండ్రికి ప్రత్యేక అనుభూతిని ఇచ్చే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
ఈ ఫాదర్స్
డేని ప్రత్యేకంగా జరుపుకోవడానికి… ముందు నుంచే మంచి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా
తండ్రితో గడుపుతూ.. ఆనందాన్ని ఇచ్చే విధంగా ఆలోచించండి. మీ నాన్నగారికి నచ్చిన
వస్తువుని గిఫ్ట్ గా.. ఇచ్చి ఉదయమే ప్రేమగా తండ్రిని పలకరిస్తూ.. ఫాదర్స్ డే
శుభాకాంక్షలు చెప్పండి. తండ్రి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ మీరు
మీ నాన్నగారికి దూరంగా ఉంటే.. ఫోన్ ద్వారా
మీరు ప్రేమని.. తండ్రితో మీకున్న అనుభవాలను గుర్తు చేసుకోండి. నాన్నకు మనసుకి నచ్చి.. మెచ్చే విధమైన గిఫ్ట్
ని ఇవ్వండి. తాను ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నా.. తాము ఎపుడూ తండ్రికి ముద్దుల పిల్లలమే
అనిపించే విధంగా తండ్రితో అనుబంధాన్ని మరింత పెంచుకోండి. సాయంత్రం సరదాగా తండ్రిని తీసుకుని ఎక్కడైకైనా
సంతోషం ఇచ్చే ప్లేస్ కు వెళ్ళండి.. పిల్లల భవిష్యత్ కోసం కొవ్వొత్తిలా కరుగుతూ
పిల్లల జీవితంలో వెలుగులు నింపే నాన్నకు ప్రేమ , త్యాగం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
0 Komentar