Five Planets Are Lining Up in The Sky on
June 24 – Details Here
అయిదు
గ్రహాలు ఒకే సరళరేఖలో - జూన్ 24న అంతరిక్షంలో మరో అద్భుతం
జూన్ 24న అంతరిక్షంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని, అయిదు గ్రహాలు ఒకే సరళరేఖలో కనిపించనున్నాయని ఆంధ్ర లయోలా
కళాశాల భౌతికశాస్త్ర ఆచార్యులు, ఖగోళశాస్త్ర
పరిశోధకులు డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ వెల్లడించారు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే
వరుసలోకి - రానున్నాయన్నారు. 'ఈ 5 గ్రహాలు 2004 డిసెంబర్ లో ఇలా
ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేశాయి. 18 ఏళ్లకోసారి
మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు.
ఇలా గ్రహాలు
ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గంట
సమయం ఈ 5
గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. దీన్ని తెల్లవారుజామున
సూర్యోదయానికి అరగంట ముందు టెలిస్కోప్, బైనాక్యులర్
అవసరం లేకుండానే నేరుగా చూడొచ్చు. సూర్యుడికి అత్యంత సమీపంలో బుధుడు ఉండటం వల్ల
మామూలు సమయాల్లో చూడడం చాలా కష్టం. కానీ.. జూన్ 24న సూర్యుడి నుంచి బుధుడు దూరంగా జరగడం వల్ల స్పష్టంగా చూసేందుకు వీలుపడుతుంది' అని శ్రీకుమార్ వివరించారు.
0 Komentar