Google
Maps Will Help You Calculate the Travel Fare, By Showing the Toll Prices Now
గూగుల్
మ్యాప్స్ లో టోల్ ఛార్జీల
వివరాలు చూపించే ఫీచర్
సొంత వాహనాలలో
దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మధ్యలో ఎన్నెన్నో టోల్ గేట్లు దాటాల్సి రావొచ్చు.
ఎంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందో తెలిస్తే? ముందుగానే
సిద్ధం కావొచ్చు కదా. గూగుల్ మ్యాప్స్ ఈ సదుపాయాన్నే తీసుకొచ్చింది.
మనదేశంతో
పాటు అమెరికా, జపాన్, ఇండోనేసియా దేశాల్లోని సుమారు 2వేల టోల్
రోడ్ల ఛార్జీల వివరాలు చూపించే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీంతో ఎక్కడెక్కడ ఎంత
రుసుము వసూలు చేస్తున్నారు. మొత్తం ప్రయాణంలో ఎంత దీనికి కేటాయించాల్సి ఉంటుందో
తెలుసు కోవచ్చు.
ప్రత్యామ్నాయ
మార్గాలను వెతికేవారి కోసం టోల్ గేట్లు లేని రోడ్లను చూపించే ఫీచర్ కూడా ఉంది. పైన
కుడి మూలన మూడు చుక్కల మీద ట్యాప్ చేసి రోడ్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. టోల్ రోడ్లలో
అసలే ప్రయాణించొద్దనుకుంటే 'అవాయిడ్ టోల్స్' ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవచ్చు.
0 Komentar