IDBI
Recruitment 2022: Apply for 1544 Executive and Assistant Manager Posts –
Details Here
ఐడీబీఐలో 1544 ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
– అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐడీబీఐ బ్యాంక్ మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో
ఏడాది (9 నెలలు క్లాస్ రూం + 3 నెలలు
ఇంటర్నషిప్) పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీబీఎఫ్)లో ట్రెయినింగ్ ఇచ్చి
ఈ కోర్సు విజయవంతగా పూర్తి చేసుకున్నవారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇస్తారు.
మొత్తం ఖాళీలు: 1544
1) ఎగ్జిక్యూటివ్ లు: 1044
2) అసిస్టెంట్ మేనేజర్లు: 500
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్
ఆపరేషన్స్/ లాంగ్వేజ్ లో డిప్లొమా/ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 01.04.2022 నాటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్
వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్
మార్కింగ్ ఉంటుంది. పత్రి తప్పు సమాధానానికి 0.25 మార్కు
చొప్పున కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.06.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.06.2022.
పరీక్ష తేదీలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 2022, జులై 09, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 2022, జులై 23.
APPLY HERE (Turn Your Mobile)
0 Komentar