Iga Swiatek Wins French
Open-2022 Singles Tennis Title - With 35th Straight Match Win This Year
ఫ్రెంచ్
ఓపెన్ - 2022 విజేత ఇగా ఇగా స్వైటెక్ -
ఈ ఏడాది వరుసగా 35వ విజయం
ఈ ఏడాది
స్వియాటెక్‌కిది వరుసగా 35వ విజయంకాగా... ఆమె
ఖాతాలో ఆరో టైటిల్ చేరింది. 21 ఏళ్ల స్వియాటెక్ 2020లో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. తొలి గ్రాండ్‌స్లామ్
ఫైనల్ చేరే క్రమంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా
కోల్పోలేదు. కానీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్వియాటెక్‌తో జరిగిన తుది
పోరులో కోకో గాఫ్ ఒత్తిడిలో చేతులెత్తేసింది. ఆమె కేవలం నాలుగు గేమ్‌లు
గెలిచింది. మరోవైపు స్వియాటెక్ పక్కా ప్రణాళికతో ఆడుతూ కోకోకు ఏ దశలోనూ పుంజుకునే
అవకాశం ఇవ్వలేదు.
కచ్చితమైన
సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో ఈ పోలాండ్ స్టార్
విజృంభించింది. సుదీర్ఘ ర్యాలీలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్వియాటెక్ చాలాసార్లు
పది ర్యాలీల్లోపే పాయింట్లు గెలుచుకుంది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే గాఫ్ సర్వీస్‌ను
బ్రేక్ చేసిన స్వియాటెక్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో గేమ్‌లో కోకో గాఫ్ తొలిసారి
తన సర్వీస్‌ను కాపాడుకోగా... ఆరో గేమ్‌లో స్వియాటెక్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, ఏడో గేమ్‌లో గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 35 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కోకో కాస్త
పోటీనిచ్చినా స్వియాటెక్‌ను ఓడించేందుకు అది సరిపోలేదు.
పోలెండ్ కు
చెందిన స్వైటెక్.. ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన కోకో గాఫ్ పై సునాయాసంగా
గెలుపొందింది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం
సాధించింది. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్
షాట్లతో విరుచుకుపడుతూ.. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్ ఈ పోరును
కేవలం 68
నిమిషాల్లోనే ముగించడం విశేషం. ఈ గెలుపుతో ఆమె రెండో
గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. 2020లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన తొలి పోలెండ్
సింగిల్స్ క్రీడాకారిణిగా స్వైటెక్ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
All the feels 🥹🇵🇱#RolandGarros | @iga_swiatek pic.twitter.com/OrcGaTeouO
— Roland-Garros (@rolandgarros) June 4, 2022
1️⃣ First the drop shot
— Roland-Garros (@rolandgarros) June 4, 2022
🎯 Then the perfect placement@CocoGauff with our Shot of the Day by @oppo #RolandGarros | #InspirationAhead pic.twitter.com/gn7HRZ1gYD
0 Komentar