Indian Culinary Institute (ICI)
Admissions 2022: All the Details for BBA & MBS Courses
ఇండియన్
కలినరీ ఇన్స్టిట్యూట్‌లో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాములు – అర్హత, కోర్సు, దరఖాస్తు మరియు ఉద్యోగ అవకాశాల వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ (ఐసీఐ) 2022 విద్యాసంవత్సరానికి తిరుపతి, నోయిడాలోని ప్రాంగణాలు, ఆమర కంఠలోని ఇందిరా
గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సంయుక్తంగా కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల
భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
1) బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)
కోర్సు
వ్యవధి: మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు)
అర్హత: కనీసం
50% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) / తత్సమాన ఉత్తీర్ణత.
2) మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
కోర్సు
వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
అర్హత: కనీసం
50% మార్కులతో ఆర్ట్స్/ హాస్పిటబిలిటీ/ హోటల్ మేనేజ్ మెంట్ లో
ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ చివరి ఏడాది
పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక
విధానం: ఐసీఐ, ఈఈ 2022 పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు
చివరి తేది: 30.06.2022
ఉద్యోగావకాశాలు:
* టూరిజం
రంగంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చెఫ్లతో
పాటు హాస్పిటాలిటీ విభాగాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
* ఎయిర్వేస్, రైల్వేలో కేటరింగ్, ఇండియన్
నేవీలో కిచెన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు, సొంతంగా
బిజినెస్ కూడా చేయవచ్చు.
* కలినరీ
ఆర్ట్స్ లో టీచింగ్ అవకాశాలు కూడా ఉన్నాయి.
* ప్రముఖ
హోటళ్లలో చెఫ్, న్యూట్రిషనిస్ట్ కిచెన్ మేనేజర్, హాస్పిటాలిటీ సర్వీసెస్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
MBA
2022-24 – APPLICATION FORM
BBA
2022-2025 – APPLICATION FORM
======================
0 Komentar