National Awards to Teachers 2022 – All the
Details Here
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు 2022 – పూర్తి వివరాలు ఇవే
======================
తెలుగు రాష్ట్రాల
నుండి NAT-2022 అవార్డులకు ఎంపికైన వారు వీరే 👇
======================
ఆంధ్ర ప్రదేశ్:
1. డాక్టర్ రావి అరుణ
కృష్ణా
జిల్లా కానూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న రావి అరుణకు అరుదైన
గుర్తింపు లభించింది. ఆమె 2022 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా రాష్ట్రం
నుంచి ఎంపికయ్యారు. మచిలీపట్నంలో జన్మించిన అరుణ ఎమ్మెస్సీ, ఎంఈడీ, పీహెచ్ చేశారు.
1996లో డీఎస్సీలో ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు.
విజయవాడ రూరల్
లోని ఎనికేపాడు, రామవరప్పాడు, నిడమానూరు, ఉంగుటూరుల్లో పనిచేశారు.
అయిదేళ్లుగా కానూరు ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. విద్యార్థులకు సరళంగా, ఆసక్తికరంగా బోధించడంలో ఆమెది అందెవేసిన చేయి. పరిసరాలను
విజ్ఞానశాస్త్రంతో అనుసంధానం చేసి సులువుగా బోధిస్తూ విద్యార్థుల్లో ఆసక్తి
కలిగిస్తారు. తన 26 ఏళ్ల సర్వీసులో ప్రభుత్వం ఇచ్చినవి తప్ప ఇతర సెలవులను ఉపయో
గించుకోలేదు.
======================
తెలంగాణ:
1. T.N. శ్రీధర్
విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తిని పెంపొందిస్తూ వారు భావి
శాస్త్రవేత్తలుగా ఎదిగేలా కృషి చేస్తున్నారు టి. ఎన్.శ్రీధర్. ఆయన మార్గదర్శనంలో
2016లో 10వ తరగతి విద్యార్థిని లక్ష్మి రూపొందించిన 'అలార్మింగ్
ఎయిడ్ ఫర్ డెఫ్ అండ్ డమ్' ప్రాజెక్టు జాతీయస్థాయి ఇన్ స్పైర్
మనక్ అవార్డు గెలుచుకుంది. ఈ విద్యార్థిని 2017లో సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో
భాగంగా వారం రోజులు జపాన్‌లో పర్యటించింది.
రాష్ట్రపతి భవన్ లో
2016, 2017లో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ లో
ప్రత్యేక ఆహ్వానితులుగా విద్యార్థిని లక్ష్మి, ఉపాధ్యాయుడు
టి. ఎన్. శ్రీధర్ పాల్గొన్నారు. 2018లో చంద్రశేఖర్ అనే విద్యార్థి రూపొందించిన
సూసైడ్ ప్రొటెక్షన్ ఫ్యాన్ ప్రాజెక్టును సైతం ఇన్ స్పైర్ మనక్ అవార్డు వరించింది.
శ్రీధర్ సొంత ఖర్చులతో యన్మన్ గండ్ల జడ్పీ హెచ్ఎస్ విద్యార్థులు 50 మందిని
విడతలవారీగా రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ లోని తన నివాసం పై
విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.
======================
2. కందాల రామయ్య
తక్కువ ఖర్చుతో బోధన ఉపకరణాల తయారీ.. విద్యార్థులకు సులభంగా
బోధించడంలో గుర్తింపు పొందారు కందాల రామయ్య. పిల్లలను ముగ్గుల ద్వారా విజ్ఞాన
వంతులను చేయడం ఆయన బోధనలో ఒక పద్ధతి. ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల రచన, విద్యార్థులకు అభ్యసన పత్రాలు, డిజిటల్ పాఠాల రూపకల్పనలో
సేవలందిస్తున్నారు. 2015లో కేంద్రశాస్త్ర సాంకేతిక విభాగం నిర్వహించిన జాతీయ
ఉపాధ్యాయ విజ్ఞాన సదస్సులో అతి తక్కువ ఖర్చుతో బోధన ఉపకరణాల తయారీ- అభ్యసన- వాటి
ప్రభావం అనే అంశంపై ఆయన సమర్పించిన పత్రం జాతీయ ఉత్తమ పరిశోధనపత్రంగా ఎంపికైంది.
బోధనలో డిజిటల్ ఉపకరణాల తయారీపై పరిశోధనలు, మనోవిజ్ఞానశాస్త్రంలో భావోద్వేగ ప్రజ్ఞపై రామయ్య సమర్పించిన పరిశోధన పత్రాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రచురితమయ్యాయి. ఈ సేవలకు గుర్తింపుగా టాటా ట్రస్టు
నిర్వహిస్తున్న కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ కార్యక్రమానికి రీసోర్సుపర్సన్ గా, ఉపాధ్యాయులకు శిక్షకుడిగా ఆయనను నియమించింది. 'గణిత
ప్రయోగశాల అభివృద్ధి- వినూత్న కృత్యాల రూపకల్పన కార్యశాల'కు గత జూన్
లో ఎన్‌సీఈఆర్టీ ఎంపిక చేసింది.
======================
3. సునీత రావు (సిబిఎస్ఈ)
32 ఏళ్లుగా బోధన రంగంలో సేవలందిస్తున్న సునీతరావు కంటెంట్ క్రియేషన్, కరిక్యులం అభివృద్ధిలో గుర్తింపు పొందారు. గణిత
పరిశోధన, రోబోటిక్స్ లో చురుకుగా
వ్యవహరిస్తున్నారు. సీబీఎస్ఈ, ఎన్ పీ వెబినార్ -సిరీస్
పెడగోగి ప్యానలిస్ట్ గా ఉన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పై ఆనందంగా ఉందని తెలిపారు. సీబీఎస్ఈ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్- హైదరాబాద్ సెక్రటరీగా, బ్రిటిష్ కౌన్సిల్ (శిక్షణ)కు సంధానకర్తగా సేవలందిస్తున్నారు. సీబీఎస్ఈ (2021-24) గవర్నింగ్ బాడీ సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు.
======================
CLICK
FOR FULL LIST OF NAT-2022
======================
ఉపాధ్యాయ
జాతీయ అవార్డు స్వీయ నామినేషన్లు చివరి తేది: 30.06.2022 12-07-2022
======================
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. జూన్ 1 నుంచి జులై 12వ తేదీ వరకు క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
======================
> 1st June to 12th July 2022: Opening
of web-portal for inviting online applications and self-nomination by teachers
> 13th July 2022 to 22nd July 2022:
District / Regional Selection Committee nominations to be forwarded to the
State Selection Committee through online portal
> 23rd July 2022 to 31st July
2022: State Selection Committee / Organization Selection Committee shortlist to
be forwarded to Independent National Jury
> 1st & 2nd August
2022: Intimation to be issued by Ministry of Education to all the shortlisted
candidates to make presentations before the National Jury (either in physical
mode at NCERT like normal years or through online like in 2021 depending on
Covid situation) (maximum 154 candidates as per extent guidelines)
> 4th Aug to 12th August 2022:
Selection process by Jury
> 12th August 2022: Finalization of
names by Independent National Jury
> 16-18th August 2022: Intimation to
selected candidates after approval of Hon’ble Shiksha Mantri
> 4th & 5th September 2022:
Rehearsal and Award function.
======================
======================
AP
EDUCATION DEPT PROCEEDINGS 22-06-2022
GOVT.OF
INDIA PROCEEDINGS 20-06-2022
======================
0 Komentar