Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEP 2020 – Norms for Reapportionment of Teaching Staff Under Govt Zilla Parishad / Mandal Praja Parishad Schools

 

NEP 2020 – Norms for Reapportionment of Teaching Staff Under Govt Zilla Parishad / Mandal Praja Parishad Schools

పాఠశాల విద్య – జాతీయ విద్యా విధానం, 2020 - వివిధ మేనేజ్‌మెంట్‌ల క్రింద ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ / మండల ప్రజా పరిషత్ పాఠశాలల బోధనా సిబ్బంది పునర్విభజన కోసం నిబంధనలతో తాజా ఉత్తర్వులు జారీ

School Education – National Education Policy, 2020 – Norms for reapportionment of teaching staff under various management viz., Government, Zilla Parishad / Mandal Praja Parishad Schools – Orders – Issued.

నూతన జాతీయ విద్యా విధానం లో ఉపాధ్యాయుల సర్దుబాటు పై నూతన మార్గదర్శకాలు ఇవే 👇

కొత్త విధానంలో ఆయా స్కూళ్ల లో 9, 10 తరగతుల్లో 20 మందికి మించి విద్యార్థులున్న చోట డ్యూయల్ మీడియం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ అదనపు సెక్షన్‌ను ఏర్పాటు చేస్తారు..

» ఏదైనా పోస్టు ఖాళీగా, మిగులుగా ఉండి అది వేరే అవసరమైన స్కూలుకు మార్పు చేయాలని ప్రతిపాదిస్తే ఆ పోస్టును సదరు స్కూలుకు బదలాయించాలి

» ఖాళీ పోస్టు లేకుంటే ఆ స్కూలులోని టీచర్ల లో జూనియర్ టీచరు బదిలీ చేయాలి

» పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడు కొత్త పాఠశాలలో పనిచేయడానికి ఇష్టప డితే అతనినే బదిలీ చేయవచ్చు.

 

స్కూళ్లలో టీచర్ల సంఖ్య ఇలా

ఫౌండేషనల్ స్కూళ్లలో (పీపీ1, పీపీ-2, 1, 2 తరగతులు)

» విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 1:30 నిష్పత్తిలో టీచర్లుండాలి » 1, 2 తరగతులకు 30 మంది వరకు విద్యా ర్డులుంటే ఒక ఎన్జీటీని నియమించాలి

» 1, 2 తరగతుల్లో 31కు మించి విద్యార్థులుంటే 2వ టీచరు కేటాయించాలి

» ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్థులకు మరో sgt ని నియమించాలి.

» ఫౌండేషనల్ (1, 2 తరగతులు) స్కూళ్లలో 10 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉంటే వాటి విషయంలో ప్రతిపాదనలను కమిషనర్ కు పంపించాలి.

 

ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లు (పీపీ1, పీపీ2, 1 నుంచి 5 తరగతులు

» ఈ స్కూళ్లలో 30 మంది విద్యార్థులుంటే ఒక sgtని నియమించాలి

» విద్యార్థుల సంఖ్య 31 దాటితే రెండో sgt ని కేటాయించాలి

» ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్ధులకు మరో ఎన్డీటీని ఇవ్వాలి

» 121 మంది విద్యార్థులుంటే ప్రైమరీ స్కూలు హెడ్మాస్టర్ పోస్టును ఏర్పాటు చేస్తారు.

» 10 మందికన్నా తక్కువగా విద్యార్థులుంటే కమిషనరకు ప్రతిపాదనలు పంపాలి.

 

ప్రీ హైస్కూలు 3 నుంచి 8 తరగతులు

» ఈ స్కూళ్లలో 1, 2 తరగతులుంటే కనుక వాటిని అదే ఆవరణలో ఫౌండేషనల్ స్కూళ్లుగా కొనసాగించాలి..

» 3-8 తరగతుల వరకు 6 సెక్షన్లకు ఆరుగురు, 7 సెక్షన్లకు ఏడుగురు, 8 సెక్షన్లకు 8 మంది సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్ల ను ఏర్పాటు చేయాలి. సీనియర్ మోస్ట్ టీచర్ హెచ్ఎంగా వ్యవహరించాలి.

» 195 మందికన్నా ఎక్కువ మంది ఉంటే 3 కిలోమీటర్ల లోపు వేరే హైస్కూలు లేకుంటే

వీటిని హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేయాలి.

» 98 మందికన్నా పిల్లలు తక్కువగా ఉంటే sa బదులు sgt లను కేటాయించాలి.

» అన్ని ప్రీ హైస్కూళ్లను 8వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయాలి..

 

3 నుంచి 10 తరగతులు, టీచర్లు ఇలా…

» 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సెక్షన్ల వారీగా ఎంతమంది ఏ యే సబ్జెక్టు టీచర్లుండాలో జీవోలో పట్టిక రూపంలో పొందుపరిచారు. 8 సెక్షన్లుంటే 10 మంది, 9 సెక్షన్లుంటే 11 మంది స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లను కేటాయించాలి. ఆపై ప్రతి అదనపు సెక్షన్‌కు అదనంగా ఒక స్కూల్ అసిస్టెంట్ ను కేటాయించాలి.

» 6 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో 5 సెక్షన్ లకు 8 మంది ఎస్ఏల ను సబ్జెక్టు టీచర్లను కేటాయించాలి. ఈ స్కూళ్లలో ప్రతి అదనపు సెక్షన్‌కు అదనంగా ఒక్కో sa టీచర్ ని కేటాయించాలి.


G.O.Ms.No. 117, Dated: 10-06-2022

DOWNLOAD G.0 117

Previous
Next Post »
0 Komentar

Google Tags